టర్మ్ ఇన్సూరెన్స్‌కి నామినీ ఎందుకు ముఖ్యం, దాన్ని ఎలా ఎంచుకోవాలి?
టర్మ్ ఇన్సూరెన్స్ నామినీ - మీరు దాని గురించి తెలుసుకోవలసినది
టర్మ్ ఇన్సూరెన్స్‌ను మీ కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించే జీవిత బీమాగా నిర్వచించవచ్చు. టర్మ్ ఇన్సూరెన్స్ అందుబాటు ధరలో ఉంటుంది, ఎవరైనా సరే తమ అర్హతను తనిఖీ చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. పరిమిత బడ్జెట్ కలిగి ఉండి హోల్ లైఫ్ బీమా పాలసీల అధిక ప్రీమియంలను భరించలేని వ్యక్తులు దీనిని తరచుగా ఎంచుకుంటారు.
టర్మ్ ఇన్సూరెన్స్‌లో ఎవరు నామినీ కావచ్చు?
మీ బీమా పాలసీకి టర్మ్ ఇన్సూరెన్స్ నామినీని ఎంచుకునేటప్పుడు, మీరు లేనప్పుడు పాలసీకి సంబంధించిన ఆర్థిక ప్రయోజనాల్ని నిర్వహించే బాధ్యత ఎవరిపై ఉంటుందో వారిని పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యం.మీ జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, పిల్లలు లేదా మీ తరపున ఆర్థిక విషయాలను నిర్వహించడానికి మీరు విశ్వసించే ఏ ఇతర వ్యక్తి అయినా నామినీగా ఉండవచ్చు.
టర్మ్ ప్లాన్‌కి సంబంధించి ఆర్థికంగా బాధ్యత కలిగి ఉండి, మంచి ఆర్థిక నిర్ణయాలు తీసుకోగల వ్యక్తిని నామినీగా ఎంచుకోవడం చాలా ముఖ్యం.పాలసీ ద్వారా లభించే మొత్తాన్ని నిర్వహించడంలో ఉండే భావోద్వేగపరమైన అంశాలను ఎదుర్కోగలవారి సామర్థ్యాన్ని కూడా మీరు పరిగణనలోకి తీసుకోవాలి, ఎందుకంటే ఇది చాలా కష్టమైన మరియు ఒత్తిడితో కూడిన పని కావచ్చు.
మీకు మైనర్ వయసున్న పిల్లలు ఉంటే, వారిని మీ నామినీగా ఒక గార్డియన్‌ని ఎంచుకోవడం తెలివైన పని కావచ్చు.ఎందుకంటే మీ బిడ్డ యుక్త వయస్సు వచ్చే వరకు అతని తరపున ఆదాయాన్ని నిర్వహించే బాధ్యత సంరక్షకుడిపై ఉంటుంది.
అంతిమంగా, మీ నామినీగా ఎవరిని ఎంచుకోవాలనే నిర్ణయం వ్యక్తిగతమైనది. ఇది మీ ప్రత్యేక పరిస్థితుల పైనా, అలాగే ఆ వ్యక్తి ఆర్థిక రాబడిని బాధ్యతాయుతంగానూ, సమర్థవంతంగానూ నిర్వహించే వ్యక్తి సామర్థ్యంపైనా ఆధారపడి ఉండాలి.
నామినీ ఎవరు?
నామినీగా ఉండేవారు, మీ జీవిత భాగస్వామి, బిడ్డ, తల్లిదండ్రులు లేదా పాలసీదారుడు ఎంచుకున్న మరే ఇతర వ్యక్తి అయినా కావచ్చు.పాలసీదారుడు తన నామినీ ఎంపికను చాలా జాగ్రత్తగా పరిశీలించడం చాలా ముఖ్యం, ఎందుకంటే పాలసీదారుడి లబ్ధిదారుల తరపున మరణ ప్రయోజనాన్ని స్వీకరించి, దాన్ని నిర్వహించే బాధ్యత ఆ నామినీదే అవుతుంది.
నామినీని నియమించడంతో పాటు, పాలసీదారుడు ఒకరు లేదా అంతకంటే ఎక్కువ కంటింజెంట్ నామినీలను కూడా నియమించడం గురించి పరిగణించాలి.కంటింజెంట్ నామినీ అనే వ్యక్తి లేదా సంస్థ, ప్రాథమిక నామినీ మరణ ప్రయోజనాన్ని స్వీకరించలేనప్పుడు లేదా స్వీకరించడానికి ఇష్టపడనప్పుడు మాత్రమే ఆ ప్రయోజనాన్ని పొందుతారు. ఇందులో ప్రాథమిక నామినీ మరణించిన సందర్భాలు లేదా అనారోగ్యం గానీ, ఇతర పరిస్థితుల కారణంగా గానీ, మరణ ప్రయోజనాన్ని నిర్వహించలేని పరిస్థితులు ఉండవచ్చు.
పాలసీదారుడు తాను ఎచుకున్న నామినీ వివరాల్ని బీమా సంస్థకు తెలియజేయడం మరియు ఆ నామినీ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంచడం అనేది చాలా ముఖ్యం. పాలసీదారుడు తన నామినీకి తన నియామకం గురించి తెలియజేయాలి. అంతే కాకుండా, పాలసీదారుని లబ్ధిదారుల తరపున మరణ ప్రయోజనాన్ని మేనేజ్ చేయడానికి గానూ వారి బాధ్యతలూ, అంచనాల గురించి వారితో చర్చించాలి.
నామినీ ప్రాముఖ్యత ఏమిటి?
బీమాలో నామినీ ప్రాముఖ్యతను తక్కువ చేసి చెప్పలేము. పాలసీదారుడు మరణించిన సందర్భంలో మరణ ప్రయోజనాన్ని పొందడానికి పాలసీదారుడు నియమించిన వ్యక్తిని నామినీ అంటారు. ఇది ఒక ముఖ్యమైన నిర్ణయం, ఎందుకంటే నామినీ తన అప్పులు తీర్చుకోవడం కోసం, తన పోషణ, తన కుటుంబ పోషణ వంటి వాటి కోసం ఈ డెత్ బెనిఫిట్‌ని ఒక ముఖ్యమైన ఆర్థిక వనరుగా ఉపయోగించుకోవచ్చు.
ఆర్థిక అంశంతో పాటు, క్లెయిమ్‌ల ప్రక్రియలో కూడా నామినీ కీలక పాత్ర పోషిస్తాడు.పాలసీదారుడి మరణానికి సంబంధించిన రుజువు మరియు అవసరమైన ఏవైనా ఇతర డాక్యుమెంటేషన్‌లను బీమా కంపెనీకి అందించాల్సిన బాధ్యత వారిదే. ఆ తర్వాత బీమా కంపెనీ క్లెయిమ్‌ను పరిశీలిస్తుంది, అంతా సక్రమంగా ఉంటే, బీమా సంస్థ నామినీకి మరణ ప్రయోజనాన్ని చెల్లిస్తుంది.
పాలసీదారుడు నామినీని జాగ్రత్తగా ఎంచుకోవాలి, ఎందుకంటే మరణ ప్రయోజనాన్ని నిర్వహించడం, పాలసీదారుడి కోరికలను తీర్చే విధంగా దానిని ఉపయోగించడం వారి బాధ్యత.పాలసీదారుడు నామినీకి వారి పాత్ర, డెత్ బెనిఫిట్ ప్రాముఖ్యత గురించి తెలుసని కూడా నిర్ధారించుకోవాలి.
సంక్షిప్తంగా చెప్పాలంటే, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలో నామినీ ఆ పాలసీకి సంబంధించిన ఆర్థికపరమైన, పరిపాలనాపరమైన అంశాలు రెండింటిలోనూ కీలక పాత్ర పోషిస్తాడు.పాలసీదారుడు నామినీని జాగ్రత్తగా ఎంచుకోవడమూ, వారికి తమ బాధ్యతల గురించి అవగాహన ఉందని నిర్ధారించుకోవడం చాలా అవసరం.
ప్రతి నామినీకి డెత్ క్లెయిమ్‌లో ఎంత శాతం వాటా ఉంటుంది?
పాలసీదారుడు నామినీలను నిర్ణయించిన తర్వాత, క్లెయిమ్ దాఖలు చేసే ప్రక్రియ పూర్తయ్యాక ఒక్కో నామినీకీ ఎంత వాటా లభిస్తుందో కూడా స్పష్టంగా పేర్కొనాలి.నామినేషన్ ఫారమ్‌లో ఇప్పటికే నిర్ణయించిన కేటాయింపుల శాతాన్ని సజావుగా ప్రాసెస్ చేయబడేలా ఇది నిర్ధారిస్తుంది.
నామినేషన్ సౌకర్యం యొక్క ప్రయోజనాలు
బీమా నామినేషన్ సౌకర్యం బహుళ ప్రయోజనాలను కలిగి ఉంది. ఇక్కడ కొన్ని ప్రధానమైనవి ఉన్నాయి:
బీమాకి సంబంధించిన వాస్తవ ప్రయోజనాన్ని నెరవేరుస్తుంది: నామినేషన్ సౌకర్యం యొక్క అతిపెద్ద ప్రయోజనాల్లో ఒకటి ఏమిటంటే, ఇది బీమాకి సంబంధించిన ప్రాథమిక లక్ష్యాన్ని నెరవేరుస్తుంది. పాలసీదారుడు దురదృష్టవశాత్తు మరణిస్తే, నామినీ ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు.
ఏ వ్యక్తినైనా ఎంచుకునే సామర్థ్యం: నామినేషన్ సౌకర్యం యొక్క మరొక ప్రయోజనం ఏమిటంటే, ఇది మీకు ఏ వ్యక్తినైనా నామినీగా నియమించే సామర్థ్యాన్ని ఇస్తుంది. అయితే, పాలసీదారుడు ఎంచుకున్న నామినీ బాధ్యతాయుతంగానూ, నమ్మదగిన వ్యక్తిగానూ ఉండేలా చూసుకోవాలి.
టర్మ్ ఇన్సూరెన్స్‌లో నామినీని మార్చవచ్చా?
అవును, పాలసీ వ్యవధిలో మీరు టర్మ్ ఇన్సూరెన్స్‌లో నామినీని ఎన్నిసార్లైనా మార్చవచ్చు.
నామినీ మరణించిన సందర్భంలో ఏం జరుగుతుంది?
పాలసీదారుడు జీవించి ఉండగానే, నామినీ దురదృష్టవశాత్తు మరణిస్తే, నామినేషన్ ప్రక్రియ చెల్లదు. అప్పుడు పాలసీదారుడు నామినీని మార్చవలసి ఉంటుంది.
నామినేషన్ దాఖలు చేసే ప్రక్రియ ఏమిటి?
నామినేషన్ చేయడానికి, పాలసీ డాక్యుమెంట్ నింపేటప్పుడు మీరు ఈ క్రింది సమాచారాన్ని సహాయక పత్రాలతో పాటు అందించాలి:
- పేరు
- వయస్సు
- చిరునామా
- పాలసీదారుడికీ, నామినీకీ మధ్య గల సంబంధం
టర్మ్ ఇన్సూరెన్స్ కోసం నామినీని నియమించకపోతే ఏమి జరుగుతుంది?
పాలసీదారుడి మరణానికి ముందు టర్మ్ ఇన్సూరెన్స్ కోసం నామినీని నియమించకపోతే, రెండు రకాల పరిస్థితులు ఏర్పడవచ్చు:
- పాలసీదారునికి వీలునామా లేకపోతే, ఆ డబ్బు ఆటోమేటిక్‌గా క్లాస్ I చట్టపరమైన వారసుడికి వెళుతుంది. అది జీవిత భాగస్వామి, కొడుకు, తండ్రి లేదా తల్లి కావచ్చు.
- పాలసీదారుడు వీలునామా వ్రాసి ఉంటే, ఆ వీలునామా ప్రకారం వారసులకు హామీ ఇవ్వబడిన మొత్తం ఇవ్వబడుతుంది.
టర్మ్ ఇన్సూరెన్స్ కోసం మైనర్లను నామినీలుగా నియమిస్తే ఏమి జరుగుతుంది?
టర్మ్ ఇన్సూరెన్స్ కోసం మైనర్‌ను నామినీగా నియమించే నిబంధన ఉంది. అటువంటి పరిస్థితిలో, మైనర్ నామినీ తరపున మొత్తాన్ని స్వీకరించగలిగే ఒక నియమిత వ్యక్తిని కూడా పాలసీదారుడు ప్రకటించాల్సి ఉంటుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు
పాలసీ గడువు ముగిసేలోపు పాలసీదారుడు మరణించిన తర్వాత బీమా క్లెయిమ్ తీసుకోవడానికి పాలసీదారుడు నిర్ణయించే వ్యక్తిని నామినీ అంటారు.
నామినీ అంటే పాలసీలో చెల్లింపును స్వీకరించే వ్యక్తి, అయితే లబ్ధిదారుడు అంటే చట్టబద్ధంగా ప్రయోజనాన్ని పొందడానికి అర్హత ఉన్న వ్యక్తి. చాలా సందర్భాలలో, వారు ఒకేలా ఉంటారు, కానీ ఎల్లప్పుడూ కాదు.
తప్పనిసరిగా కాదు. చాలా మంది కుటుంబ సభ్యుడిని ఎంచుకుంటారు, కానీ నామినీ పాలసీదారుడు స్నేహితులు లేదా బంధువులతో సహా విశ్వసించే ఏ వ్యక్తి అయినా కావచ్చు.
అవును. మీరు ఒకరి కంటే ఎక్కువ మందిని నామినేట్ చేయవచ్చు మరియు ప్రతి నామినీ మరణ ప్రయోజనం నుండి ఎంత శాతం వాటాను పొందాలో నిర్ణయించవచ్చు.
టర్మ్ ఇన్సూరెన్స్ నామినీ నియమాలు పాలసీ ప్రయోజనాన్ని పొందడానికి ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల పేర్లను పేర్కొనడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. మీరు ఎప్పుడైనా నామినీని మార్చవచ్చు మరియు నామినీ పేరు ప్రస్తావించబడకపోతే, వారసత్వ చట్టాల ప్రకారం మీ చట్టపరమైన వారసులకు ప్రయోజనం ఇవ్వబడుతుంది.