సరైన టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి
టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎలా ఎంచుకోవాలి
సరైన టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎంచుకోవడం మీరు తీసుకునే అతి ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలలో ఒకటి. ఇది మీ ప్రియమైన వారికి ఆర్థికపరమైన అండదండలు అవసరమైన సమయంలో వారు సురక్షితంగా ఉండేలా ఇది భరోసా కల్పిస్తుంది. అనేక రకాల ఎంపికలు అందుబాటులో ఉన్నందున, మీ అవసరాలను తీర్చే పాలసీని తీసుకునేలా చూడడానికి టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్‌ను ఎలా ఎంచుకోవాలో అర్థం చేసుకోవడం చాలా కీలకం. ఈ ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడంలో మీకు సహాయపడే కొన్ని సూచనలు ఇక్కడ ఉన్నాయి.
మీ అవసరాలను నిర్ణయించండి
టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకునే ముందు, మీ ప్రస్తుత మరియు భవిష్యత్తు అవసరాలను అంచనా వేయడానికి కొంత సమయం కేటాయించండి. మీకు ఏదైనా జరగరానిది జరిగితే మీ కుటుంబ ఆర్థిక అవసరాల గురించి ఆలోచించండి. మీకు చిన్న పిల్లలు ఉంటే, వారికి విద్య, ఇతర ఖర్చులను భరించడానికి మీకు అధిక కవరేజ్ అవసరం.
అలా కాకుండా, ఒంటరిగా ఉన్న వ్యక్తికి అంత కవరేజ్ అవసరం లేకపోవచ్చు. మీ రుణాలు, నెలవారీ ఇంటి ఖర్చులు మరియు మీపై ఆధారపడిన వారి గురించి ఆలోచించండి. ద్రవ్యోల్బణం మరియు కాలక్రమేణా ఆర్థిక పరిస్థితి ఎలా మారవచ్చు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవడం ఎల్లప్పుడూ తెలివైన పని.
మీరు మీ అవసరాలను అంచనా వేసిన తర్వాత, మీరు ఎంత కవరేజ్ తీసుకోవాలో మీకు బాగా అర్థం అవుతుంది. మీరు లేనప్పుడు మీ కుటుంబ జీవనశైలికి మద్దతు ఇవ్వడానికి కవరేజ్ మొత్తం సరిపోతుందని నిర్ధారించుకోండి. మీరు వివిధ కవరేజ్ ఎంపికలతో కూడిన టర్మ్ ప్లాన్‌ను ఎంచుకోవాలి, ఇది మీ ఆర్థిక అవసరాలకు సరిపోయేదాన్ని ఎంచుకోవడానికి మీకు వీలు కల్పిస్తుంది.
టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటే ఏమిటి?
టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది ఒక రకమైన జీవిత బీమా, ఇది ఒక నిర్దిష్ట కాలానికి లేదా "టర్మ్" కి ఆర్థిక రక్షణను అందిస్తుంది. బీమా చేయబడిన వ్యక్తి పాలసీ వ్యవధిలో మరణిస్తే, బీమా కంపెనీ అంగీకరించిన హామీ మొత్తాన్ని నామినీకి చెల్లిస్తుంది. ఇది అత్యంత అందుబాటు ధరలో లభించే జీవిత బీమా రూపాలలో ఒకటి, ఇది సాపేక్షంగా తక్కువ ప్రీమియంలతో అధిక బీమా కవరేజీని అందిస్తుంది. టర్మ్ ఇన్సూరెన్స్‌లో పొదుపు లేదా పెట్టుబడి భాగం ఉండదు, అందువల్ల ఇది పూర్తిగా రక్షణపైనే దృష్టి సారించే ఒక ఉత్పత్తి.
ఉత్తమ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎలా ఎంచుకోవాలి: గుర్తుంచుకోవలసిన ముఖ్య అంశాలు
టర్మ్ ఇన్సూరెన్స్‌ను ఎలా ఎంచుకోవాలో ఆలోచిస్తున్నప్పుడు, ప్రీమియం మొత్తాన్ని మాత్రమే కాకుండా, అంతకు మించి చూడటం ముఖ్యం. క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి, ద్రవ్య సామర్థ్య నిష్పత్తి, రైడర్ ప్రయోజనాలు మరియు భవిష్యత్తులో మీ కుటుంబ ఆర్థిక అవసరాల వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఈ విధానం మీకు అందుబాటు ధరలో ఉండే, సమగ్ర రక్షణని అందించే ప్లాన్‌ని ఎంచుకునేలా చేస్తుంది.
సరైన టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకునేటప్పుడు పరిగణించవలసిన అంశాలు
మీరు మీ అవసరాలను అంచనా వేసుకున్న తర్వాత, ఇక కొన్ని నిర్దిష్ట అంశాలను నిశితంగా పరిశీలించాల్సిన సమయం ఆసన్నమైంది. మీ నిర్ణయానికి ఆరు ప్రధాన అంశాలు మార్గనిర్దేశం చేయాలి.
క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి
టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను మూల్యాంకనం చేసేటప్పుడు ముందుగా తనిఖీ చేయవలసిన విషయాలలో బీమా సంస్థ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి ఒకటి. ఈ నిష్పత్తి సంవత్సరంలో చేసిన మొత్తం క్లెయిమ్‌లలో బీమా సంస్థ ఎన్ని క్లెయిమ్‌లను విజయవంతంగా పరిష్కరించిందో మీకు తెలియజేస్తుంది. అధిక క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి అంటే క్లెయిమ్‌లను ప్రాసెస్ చేయడం, పరిష్కరించడం విషయంలో కంపెనీ నమ్మదగినదని అర్థం.
ఉదాహరణకు, ఒక బీమా సంస్థకు 98% క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి ఉంటే, అంటే 100 క్లెయిమ్‌లలో 98 విజయవంతంగా పరిష్కరించబడ్డాయని అర్థం. అప్పుడు మీరు తెలివిగా, 95% లేదా అంతకంటే ఎక్కువ క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి ఉన్న కంపెనీని ఎంచుకోవాలి. మీరు లేనప్పుడు మీ కుటుంబం చేసే క్లెయిమ్‌లు అనవసరమైన ఇబ్బందులను ఎదుర్కోవని తెలిసినప్పుడు ఇది మనశ్శాంతిని కలిగిస్తుంది.
సాల్వెన్సీ నిష్పత్తి
టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకునేటప్పుడు పరిశీలించాల్సిన మరో కీలకమైన అంశం సాల్వెన్సీ నిష్పత్తి. ఈ నిష్పత్తి బీమా సంస్థ యొక్క ఆర్థిక బలం మరియు క్లెయిమ్‌లను చెల్లించే సామర్థ్యం గురించి లోతైన అవగాహన అందిస్తుంది. ఐఆర్‌డీఏఐ (భారత బీమా నియంత్రణ మరియు అభివృద్ధి అథారిటీ) ప్రకారం, బీమా సంస్థలు కనీసం సాల్వెన్సీ రేషియో 1 గా ఉండేలా చూసుకోవాలి. సంక్షోభాలు లేదా అత్యవసర సమయాల్లో కూడా కంపెనీలు క్లెయిమ్‌లను చెల్లించగలవని నిర్ధారించడానికి ఈ నిబంధన ప్రవేశపెట్టబడింది.
ఉదాహరణకు, ప్రకృతి వైపరీత్యం కారణంగా క్లెయిమ్‌లు అకస్మాత్తుగా పెరిగితే, బలమైన సాల్వెన్సీ నిష్పత్తి ఉన్న బీమా సంస్థ అనేక క్లెయిమ్‌లను నిర్వహించడానికి మెరుగ్గా సన్నద్ధమై ఉంటుంది. అధిక సాల్వెన్సీ నిష్పత్తి ఉన్న బీమా సంస్థను ఎంచుకోవడం ద్వారా, అవసరమైనప్పుడు క్లెయిమ్‌లను చెల్లించడానికి మీ బీమా సంస్థకు ఆర్థిక మద్దతు ఉందని మీరు నిర్ధారిస్తున్నారు.
తీవ్ర అనారోగ్య బీమా
చాలా ప్రాథమిక టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు మరణాన్ని మాత్రమే కవర్ చేస్తాయి. అయితే, క్రిటికల్ ఇల్నెస్ రైడర్ మీ పాలసీకి గణనీయమైన విలువను జోడించగలదు. క్యాన్సర్, గుండెపోటు లేదా స్ట్రోక్స్ వంటి క్రిటికల్ అనారోగ్యాలు అధిక చికిత్స ఖర్చుల కారణంగా ఆర్థిక భారాన్ని కలిగిస్తాయి.
మీ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీకి క్రిటికల్ ఇల్నెస్ రైడర్‌ను జోడించడం వలన మీరు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే, వైద్య ఖర్చులను భరించడంలో సహాయపడే చెల్లింపుని మీరు అందుకుంటారని నిర్ధారించుకోవచ్చు. ఈ బెనిఫిట్ మరణానికి ముందే ఆర్థిక రక్షణని కల్పిస్తుంది. తద్వారా అనారోగ్యం సంభవించినపుడు మీ కుటుంబంపై పడే ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది. ఉదాహరణకు, మీకు క్రిటికల్ ఇల్నెస్ రైడర్‌తో 1 కోటి రూపాయల టర్మ్ ప్లాన్ ఉందని అనుకుందాం. మీకు తీవ్రమైన అనారోగ్యం ఉన్నట్లు నిర్ధారణ అయితే, పాలసీ నిబంధనలను బట్టి చికిత్స ఖర్చుల కోసం ఈ హామీ మొత్తంలో కొంత శాతాన్ని మీరు పొందవచ్చు.
అదనపు రైడర్స్ ప్రయోజనాలు
బీమా కంపెనీలు ప్రాథమిక టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను మెరుగుపరిచే మరియు మీ అవసరాలకు అనుగుణంగా అనేక రైడర్‌లను అందిస్తున్నాయి. సాధారణ రైడర్ ఎంపికలలో ప్రీమియం మినహాయింపు, ప్రమాదవశాత్తు మరణ ప్రయోజనం, ఇన్‌కమ్ బెనిఫిట్, క్లిష్టమైన అనారోగ్య రైడర్లు ఉన్నాయి. ఉదాహరణకు, ప్రీమియం మినహాయింపు రైడర్ అనేది ఒకవేళ మీరు అంగ వైకల్యానికి గురైనా లేదా తీవ్ర అనారోగ్యానికి లోనైనా, భవిష్యత్తులో ప్రీమియంలు చెల్లించాల్సిన అవసరం లేదని నిర్ధారిస్తుంది, కానీ మీ కవరేజ్ చెక్కుచెదరకుండా ఉంటుంది.
కానీ యాక్సిడెంటల్ డెత్ రైడర్లు, ప్రమాదవశాత్తు మరణం సంభవించినట్లయితే, సాధారణ చెల్లింపు కంటే హామీ ఇవ్వబడిన మొత్తం ఎక్కువగా ఉండేలా చూస్తాయి. ఉదాహరణకు, మీకు ప్రమాదవశాత్తు మరణ రైడర్ ఉండి, మీ బేస్ కవర్ ₹50 లక్షలు ఉంటే, ప్రమాదవశాత్తు మరణం సంభవించినప్పుడు మీ కుటుంబం ₹1 కోటి వరకు పొందవచ్చు. ఈ రైడర్లు అదనపు భద్రతా కవచాన్ని అందిస్తూ జీవితంలోని వివిధ సందర్భాల్లో అన్ని అంశాలూ పరిరక్షించబడేలా చూస్తాయి.
ప్రీమియం రేట్లు
టర్మ్ ఇన్సూరెన్స్ అత్యంత అందుబాటులో ఉండే జీవిత బీమా రకాల్లో ఒకటి అయినప్పటికీ, మీరు చెల్లించే ప్రీమియం రేటు వివిధ అంశాలను బట్టి మారవచ్చు. యువకులు సాధారణంగా తక్కువ ప్రీమియంలను చెల్లిస్తారు ఎందుకంటే వారిని బీమా సంస్థలు తక్కువ-రిస్క్‌గా భావిస్తాయి. ఉదాహరణకు, 30 ఏళ్ల వయస్సు గల ధూమపానం చేయని వ్యక్తి ₹1 కోటి కవర్ కోసం నెలకు ₹500 చెల్లించవచ్చు, అయితే పెద్దవారు లేదా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ప్రీమియం ధరల ఆధారంగా మాత్రమే మీ నిర్ణయం తీసుకోకండి.
కొన్నిసార్లు, చౌకగా వచ్చే పాలసీలు అంత వెసులుబాటునీ లేదా కవరేజీని అందించకపోవచ్చు. ఎస్‌బీఐ లైఫ్ వంటి వివిధ బీమా సంస్థల ప్లాన్‌లను పోల్చి చూడడం ద్వారా, అందుబాటు ధర, సమగ్ర కవరేజ్ మధ్య సమతుల్యతను పాటించే ప్లాన్‌ని మీరు కనిపెట్టవచ్చు.
మీ అవసరాల ఆధారంగా కవరేజ్ ప్లాన్‌ను ఎంచుకోండి
కవరేజ్ ప్లాన్‌ను నిర్ణయించేటప్పుడు, మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి మరియు మీ భవిష్యత్తు లక్ష్యాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. మీకు రుణాలు ఉన్నాయా లేదా తనఖా ఉందా? మీపై ఆధారపడిన వారికి ఎంతకాలం ఆర్థిక సహాయం అవసరం?
ఉదాహరణకు, ఇద్దరు చిన్న పిల్లలతో కూడిన మీ కుటుంబంలో మీరొక్కరే సంపాదనపరులైతే, మీ జీవనశైలి, భవిష్యత్తు ఆర్థిక నిబద్ధతలను బట్టి ₹1 కోటి లేదా అంతకంటే పెద్ద బీమా కవర్‌ను ఎంచుకోవడం విఙ్డతతో కూడిన నిర్ణయం. దీనికి విరుద్ధంగా, మీ పిల్లలు పెద్దవారైతే మరియు మీరు గణనీయమైన అప్పులు తీర్చినట్లయితే, మీకు అంత పెద్ద కవర్ అవసరం ఉండకపోవచ్చు. మీరు లేనప్పుడు కూడా మీ కుటుంబ ఆర్థిక అవసరాలు తీర్చబడతాయని నిర్ధారించుకోవడం లక్ష్యం.
టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ యొక్క ఖర్చులు మరియు ప్రయోజనాలను అర్థం చేసుకోండి
ప్రీమియం ఖర్చు మరియు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అందించే ప్రయోజనాల మధ్య సమతుల్యతను సాధించడం ముఖ్యం. అధిక ప్రీమియం అంటే తరచుగా మరింత సమగ్ర కవరేజ్ అని అర్థం, అయితే అది మీకు ఉత్తమ ఎంపిక అని అర్థం కాదు.
ఖర్చులను జాగ్రత్తగా తూకం వేసుకుని, అధిక ప్రీమియంలతో మీపై అధిక భారం పడకుండా చూసుకోండి. మీ పాలసీ విలువను పెంచడానికి క్రిటికల్ ఇల్నెస్ రైడర్స్ లేదా ఇన్‌కమ్ బెనిఫిట్ రైడర్స్ వంటి అదనపు ప్రయోజనాలతో కూడిన ప్లాన్‌ల కోసం చూడండి.
ముగింపు
ఇప్పుడు మీకు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎలా సమర్థవంతంగా ఎంచుకోవాలో తెలుసు. మీరు అర్థం చేసుకోగలిగినట్లుగా, సరైన టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకోవడం అంటే మీ కుటుంబ ఆర్థిక అవసరాలను అర్థం చేసుకోవడం మరియు పాలసీ లక్షణాలతో వాటిని సమతుల్యం చేయడం.
క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తుల నుండి సాల్వెన్సీ మరియు క్రిటికల్ ఇల్నెస్ రైడర్ల వరకు, ప్రతి అంశం మీ ప్రియమైన వారిని తగినంతగా రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జాగ్రత్తగా ప్రణాళిక వేసుకుంటే, మీరు సరసమైన మరియు సమగ్రమైన ప్రణాళికతో మీ కుటుంబ భవిష్యత్తును భద్రపరచవచ్చు.
తరచుగా అడిగే ప్రశ్నలు
ఉత్తమ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకోవడానికి, మీ కుటుంబ ఆర్థిక అవసరాలను అంచనా వేయండి, క్లెయిమ్ సెటిల్‌మెంట్ మరియు సాల్వెన్సీ నిష్పత్తులను పోల్చండి, అందుబాటులో ఉన్న రైడర్‌లను తనిఖీ చేయండి మరియు కవరేజ్ మొత్తం మీ భవిష్యత్తు బాధ్యతలకు సరిపోతుందని నిర్ధారించుకోండి.
అధిక క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి బీమా సంస్థ క్లెయిమ్‌లను ప్రాసెస్ చేయడంలో మరియు ఆమోదించడంలో నమ్మదగినదని సూచిస్తుంది, మీరు లేనప్పుడు మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది.
సాల్వెన్సీ నిష్పత్తి బీమా సంస్థ యొక్క ఆర్థిక బలాన్ని మరియు క్లెయిమ్‌లను చెల్లించే సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది, ముఖ్యంగా అత్యవసర సమయాల్లో. IRDAI కనీస నిష్పత్తి 1.5ని తప్పనిసరి చేస్తుంది.
ద్రవ్యోల్బణం మరియు మారుతున్న ఆర్థిక అవసరాలను పరిగణనలోకి తీసుకుని, మీ కుటుంబ ఖర్చులు, అప్పులు మరియు భవిష్యత్తు లక్ష్యాలను కవర్ చేయడానికి మీ కవరేజ్ సరిపోతుంది.