సూక్ష్మ అవధి భరోసా ప్లాన్ | ఎస్బిఐ లైఫ్ - గ్రూప్ మైక్రో షిల్డ్
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

ఎస్‌బిఐ లైఫ్ - గ్రూప్ మైక్రో షిల్డ్

UIN: 111N138V01

play icon play icon
Group Micro Shield Plan Premium

ప్రతి ఒక్కరికి భద్రత
సులభం చేయడం జరిగింది

ఒక గ్రూప్, నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, ప్యూర్ రిస్క్ ప్రీమియం, ఒక్క సంవత్సరం పునరుద్ధరణ మైక్రో లైఫ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తి.

అందుబాటైన ప్రీమియమ్‌కే​ మీరు మీ సమూహ సభ్యులకు జీవిత బీమా భద్రత అందించాలనుకుంటున్నారా?

అందుకే, ఎస్‌బిఐ లైఫ్ - గ్రూప్ మైక్రో షిల్డ్ ని అందుబాటైన ధరకే 'బీమా భద్రత' కావాలనుకునేవారి కోసం ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. ఎస్‌బిఐ లైఫ్ - గ్రూప్ మైక్రో షిల్డ్ తో, ఏదైనా అనూహ్య సంఘటన తలెత్తుతే మీరు మీ సభ్యుల కుటుంబాలకు ఆర్థిక భద్రత పునఃహామీని ఇవ్వవచ్చు.

ఉత్పత్తి కీలకమైన ప్రత్యేకతలు:
  • ఎస్‌బిఐ లైఫ్ - గ్రూప్ మైక్రో షిల్డ్, మీ సభ్యుల బీమా అవసరాలకు సరైన సమాధానం.
  • ఉద్యోగి-యజమాని సమూహాలు, సూక్ష్మ ఆర్థిక సంస్థల సమూహ సభ్యులు, స్వీయ సహాకార సమూహాలు, బ్యాంక్/విత్తీయ సంస్థలు, ఎన్‌జిఓలు, ఏదైనా అనుబంధ సమూహాల (డిజిటల్ వేదికతో పాటు) మొదలగు నిబంధనల కింద అనుమతించబడి వాటికి ఈ ప్లాన్ విస్తృత భద్రత అందించనుంది.
  • చేరడానికి మరియు నిర్వహించడానికి సులభం.
  • సౌలభ్యమైన ప్రీమియం చెల్లింపు ఫ్రీక్వెన్సీ

ముఖ్యాంశాలు

ఎస్బిఐ లైఫ్ - గ్రూప్ మైక్రో షిల్డ్

Group pure term micro insurance, non-linked, non-participating plan

ప్రత్యేకతలు :

  • మీ సమూహం సభ్యులకు వ్యవధి బీమా
  • ఈ ఉత్పత్తి అందిస్తుంది OYRGTA (ఒక్క సంవత్సరం పునరుద్ధరణ సమూహ వ్యవధి బీమా)
  • ప్రీమియం చెల్లింపు వ్యవధి వార్షికం, ఆరు-నెలలు, మూడు నెలలు, నెలనెల
  • ఈ ఉత్పత్తి అందిస్తుంది భాగస్వామి భద్రత లాభం (ఎంచుకుంటే), ఇది తప్పనిసరి లేదా స్వేచ్ఛతో కూడుకొని ఉంటుంది, సభ్యుల భాగస్వామికి సమూహం పాలసీదారు సభ్యుల భాగస్వామికి మృత్యువు లాభం భద్రత అందించేందుకు

లాభాలు:

  • భద్రత: అనూహ్యమైన సంఘటన తలెత్తుతే మీ సమూహ సభ్యుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కలిగిస్తుంది.
  • సౌలభ్యం: మీ సభ్యులకు అందించాలనుకునే బీమా రాశిని ఎంచుకునే ఎంపిక
  • సులభత్వం: వైద్య పరీక్షలు అవసరం ఉండవు, స్వీకరించడం అనేది సంతృప్తికరమైన ఆరోగ్యం వెల్లడి ఆధారంగా ఉంటుంది.
  • అందుబాటు: మాములు ప్రీమియానికే ప్లాన్ లాభాలు.

మృత్యువు లాభం:


భద్రత వ్యవధి కొనసాగుతుండగా భద్రతగల సభ్యులు మరణిస్తే మృత్యువు లాభం, అనే బీమా రాశి, ఏకమొత్తంలో చెల్లించడం జరుగుతుంది. అయితే దీని కోసం చెల్లించవలసిన అన్ని గడువు ముగింపు ప్రీమియమ్స్ చెల్లించబడి ఉండాలి. ఋణదాత-ఋణగ్రహిత స్కీముల విషయంలో, అర్హత సంస్థలలో సభ్యుని మృత్యువు సంభవిస్తే*, ప్రారంభంలో సమూహ సభ్యులు అందించిన అధికారానికి లోబడి బకాయి లోన్ మొత్తాన్ని, మాస్టర్ పాలసీదారుకు చెల్లించడం జరుగుతుంది, మృత్యువు లాభం మొత్తం మరియు బ్యాలెన్స్ ఏదైనా ఉంటే, నామిని/లాభానికి అర్హులకు చెల్లించడం జరుగుతుంది. అధికారం అందించని పక్షంలో, మృత్యువు లాభాన్ని నామిని లేదా లాభానికి అర్హులకు చెల్లించడం జరుగుతుంది.
క్రెడిట్ అనుసంధానమైన/ఋణదాత-ఋణగ్రహిత సంబంధాలకు మూల బీమా రాశి సమూహ సభ్యులకు పాలసీ ప్రారంభంలో కనీసం బకాయి లోన్ మొత్తానికి సమానం మరియు పాలసీ వ్యవధి అంతా అలాగే కొనసాగుతుంది.
*అర్హత సంస్థలలో దిగువ పేర్కొన్న సంస్థలు ఉంటాయి: (i) రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) సంచలిత ప్రమాణిత వాణిజ్య బ్యాంకులు (కోఆపరేటివ్ బ్యాంకులతో సహా), (ii) రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నమోదిత సర్టిఫికెట్ గల బ్యాంకింగ్-రహితమైన ఆర్థిక కంపెనీలు (ఎన్‌బిఎఫ్‌సిలు) (iii) నేషనల్ హౌజింగ్ బోర్డ్ (ఎన్‌హెచ్‌బి) సంచలిత గృహ ఋణాల కంపెనీలు, (iv) నేషనల్ మైనారిటి డెవెలొప్మెంట్ ఫైనాన్స్ కార్పోరేషన్ (ఎన్‌ఎమ్‌డిఎఫ్‌సి) మరియు వారి రాష్ట్ర చాన్లైజింగ్ ఎజెన్సీలు, (v) రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా సంచలిత చిన్న విత్తీయ బ్యాంక్స్, (vi)ఒకరికొకరు సహకరించుకొని ఏర్పడిన కోఆపరేటివ్ సొసైటీస్ మరియు వర్తించే అలాంటి సొసైటి చట్టం కింద రిజిస్టర్ చేసుకోబడినది, (vii) కంపెనీల చట్టం, 2013 సెక్షన్ 8 కింద రిజిస్టర్ చేసుకోబడిన సూక్ష్మ ఆర్థిక కంపెనీలు లేదా సమయ సమయాలకు ఆమోదించబడిన ఇతర శ్రేణిలు.

మేచ్యురిటి లాభం:

మేచ్యురిటి నాడు ఈ పాలసీ కింద ఎలాంటి లాభాలు చెల్లించడం జరగదు.

అప్పగింత లాభం:

వర్తించదు

ప్రత్యామ్నాయ భద్రత-భాగస్వామి భద్రత లాభం

  • కనీసం 50 సభ్యులు గల సమూహం స్కీముతో ఈ ఎంపికను ఎంచుకోవచ్చు.
  • ఈ ఎంపిక సమూహం పాలసీదారుకు సభ్యుల భాగస్వామికి మృత్యువు లాభం భద్రతను అందించేందుకు వీలుకలిగిస్తుంది. ఈ భద్రత తప్పనిసరి లేదా స్వేచ్ఛపైన ఆధారపడి ఉంటుంది. పాలసీ ప్రారంభంలో కనీసం సమూహం యొక్క 10% పాల్గొనే స్థాయి కలిగివుండాలి.
  • ఈ ఎంపిక మాస్టర్ పాలసీదారు స్థాయిలో అందుబాటులో ఉంటుంది.
  • భద్రత ప్రాథమిక సభ్యుని బీమా రాశికి తక్కువ లేదా సమానంగా ఉంటుంది.
  • ప్రాథమిక సభ్యునికి మృత్యువు సంభవిస్తే ప్రీమియం సేకరించిన పాలసీ వ్యవధి వరకు భాగస్వామికి భద్రత కొనసాగుతూనే ఉంటుంది.

పునరుద్ధణ సదుపాయం:

  • ఏడాది ప్రీమియం ఫ్రీక్వెన్సీకి వర్తించదు.
  • ఏడాది ప్రీమియం ఫ్రీక్వెన్సీ కాకుండా ఇతరవాటికి:
    మొదటిసారి ప్రీమియం చెల్లించని గడువు ముగింపు తేది నుంచి 3 నెలలలోపున మరియు పాలసీ వ్యవధి ముగింపుకి ముందు పాలసీని పునరుద్ధరించుకోవచ్చు. జీవిత బీమా కొనసాగించాలనే ఋజువు మరియు వడ్డీతో పాటు అన్ని గడువు ముగిసిపోయిన ప్రీమియమ్స్ చెల్లించి, రాతపూర్తి దరఖాస్తు చేసుకుంటే పునరుద్ధరణను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. కంపెనీవారి బోర్డు ఆమోదిత అండర్రైటింగ్ పాలసీ ప్రకారం అండర్రైటింగ్‌కి లోబడి పునరుద్ధరణ ప్రభావంలోకి వస్తుంది. బీమా తీసుకున్న సభ్యులకు నిర్ణయం సమాచారాన్ని అందించిన తర్వాత మాత్రమే పునరుద్ధరణ ప్రభావంలోకి వస్తుంది.
    గ్రేస్ వ్యవధి ముగింపుతో (మరియు పునరుద్ధరణ వ్యవధిలో) సభ్యుని జీవిత భద్రత రద్దవుతుంది మరియు సభ్యులు మరణిస్తే ఎలాంటి మృత్యువు లాభం చెల్లించడం జరగదు.
    సమయసమయాలకు కంపెనీ వెల్లడించిన ధర ప్రకారం వడ్డీ చార్జీ చేయడం జరుగుతుంది. కంపెనీ ప్రస్తుత పాలసీ ప్రతి సంవత్సరానికి మాములు వడ్డీ ధర ఆధారంగా ఉంటుంది మరియు ఇది ప్రతి విత్తీయ సంవత్సరం ఏప్రిల్ 1టి నాటి ఆర్‌బిఐ రెపొ ధర రాబడి బెంచ్‌మార్క్‌కి 250 మూల పాయింట్స్‌కి అధికంగా ఉంటుంది మరియు ఆరు నెలల ఆధారంగా గుణాంకాలతో పెరుగుతుంది. ఏప్రిల్ 1, 2022 నాటి రెపొ ధర 4.00%. పునరుద్ధరణ ధరను నిర్ధారించేందుకు ఏదైనా మార్పును ఆధారంగా చేసుకునేందుకు జీవిత బీమా ఉత్పత్తుల మరియు రైడర్స్, సిఐఆర్ నం. IRDAI/ACTL/CIR/PRO/207/10/2022 తేది అక్టోబర్ 04, 2022ని వాడి మరియు ఫైల్ చేసుకోవలసి ఉంటుంది.
ఎస్‌బిఐ లైఫ్ - గ్రూప్ మైక్రో షీల్డ్‌కి సంబంధించిన రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనల పూర్తి వివరాల కోసం దిగువ పేర్కొన్న డాక్యుమెంట్లను శ్రద్ధగా చదవండి.
SBI Life Group Micro Shield Premium
*చివరి పుట్టినరోజు నాటి వయసు.
**అన్ని ఎస్‌బిఐ లైఫ్ గ్రూప్ మైక్రో ఇన్సూరెన్స్ ఉత్పత్తులకు జమా బీమా రాశిని ప్రతి సమూహ సభ్యుని రూ. 2,00,000 వద్ద క్యాప్ చేయడం జరుగుతుంది.
^వర్తించే పన్ను నియమాల ప్రకారం సమయ సమయాలకు భారతదేశ రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర పభుత్వం నిర్ధేశించిన ప్రకారం ప్రీమియం పైన వర్తించే పన్నులు మరియు/లేదా ఇతర చట్టబద్ధమైన సుంకాలు/ప్రీమియం పైన సర్చార్జీ చెల్లించవలసి ఉంటుంది.
$పాలసీ వ్యవధి మాస్టర్ పాలసీ స్థాయిలో ఉంటుంది.

3B/ver1/02/23/WEB/TEL

*పన్ను ప్రయోజనాలు:
కాలానుగుణంగా భారతదేశంలోని వర్తించే ఆదాయం పన్ను చట్టాలు ప్రకారం మీరు పన్ను ప్రయోజనాలు/ మినహాయింపులకు అర్హత పొందుతారు, అది నియమాల ప్రకారం సమయ సమయానికి మార్పుకు లోబడి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారున్ని సంప్రదించండి.

కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకునే ముందు రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం దయచేసి అమ్మకాల బ్రోచర్‌ని శ్రద్ధగా చదవండి.