సూక్ష్మ అవధి భరోసా ప్లాన్ | ఎస్‌బిఐ లైఫ్ - గ్రూప్ మైక్రో షిల్డ్ - ఎస్పి
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

ఎస్‌బిఐ లైఫ్ - గ్రూప్ మైక్రో షిల్డ్ - ఎస్‌పి

UIN: 111N137V01

play icon play icon
Group Micro Shield - SP Plan Premium

మీరు చేసిన భద్రత
వాగ్దానం నెరవేరింది

ఒక గ్రూప్, నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, ప్యూర్ రిస్క్ ప్రీమియం, మైక్రో లైఫ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తి.

అందుబాటైన ప్రీమియమ్‌కే మీరు మీ సమూహ సభ్యులకు జీవిత బీమా భద్రత అందించాలనుకుంటున్నారా?

అందుబాటైన ధరకే "బీమా భద్రత" కావాలనుకునేవారి కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఒక ప్లాన్.
అందుకే, ఎస్‌బిఐ లైఫ్ - గ్రూప్ మైక్రో షిల్డ్ -ఎస్‌పిని అందుబాటైన ధరకే ‘బీమా భద్రత’ కావాలనుకునేవారి కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఒక ప్లాన్. ఎస్‌బిఐ లైఫ్ - గ్రూప్ మైక్రో షిల్డ్ -ఎస్‌పి తో, ఏదైనా అనూహ్య సంఘటన తలెత్తుతే మీరు మీ సభ్యుల కుటుంబాలకు ఆర్థిక భద్రత పునఃహామీని ఇవ్వవచ్చు.

ఉత్పత్తి కీలకమైన ప్రత్యేకతలు:
  • ఎస్‌బిఐ లైఫ్ - గ్రూప్ మైక్రో షిల్డ్ - ఎస్‌పి, మీ సభ్యుల బీమా అవసరాలకు సరైన సమాధానం.
  • చేరి మరియు అందించడం సులభం.
  • స్థాయి భద్రత మరియు తగ్గింపు భద్రత ప్రణాళిక ఎంపికలు రెండింటికి సంయుక్త జీవిత బీమా భద్రత దొరుకుతుంది.
  • ఉద్యోగి-యజమాని సమూహాలు, సూక్ష్మ ఆర్థిక సంస్థల సమూహ సభ్యులు, స్వీయ సహాకార సమూహాలు, బ్యాంక్/విత్తీయ సంస్థలు, ఎన్‌జిఓలు, ఏదైనా అనుబంధ సమూహాల (డిజిటల్ వేదికతో పాటు) మొదలగు నిబంధనల కింద అనుమతించబడివాటికి ఈ ప్లాన్ విస్తృత భద్రత అందించనుంది.

ముఖ్యాంశాలు

ఎస్బిఐ లైఫ్ - గ్రూప్ మైక్రో షిల్డ్ - ఎస్పి

Group pure term micro insurance, non-linked, non-participating plan

 

ప్రత్యేకతలు:

  • మీ సమూహ సభ్యులకు వ్యవధి బీమా
  • ఈ ఉత్పత్తి 2 ప్లాన్ ఎంపికలను అందిస్తుంది -స్థాయి భద్రత తగ్గింపు భద్రత ఋణదాత-ఋణగ్రహితకు మాత్రమే ఎంపిక అందుబాటులో ఉంటుంది మరియు సమూహ సభ్యులు తీసుకున్న ఋణానికి దీనిని తీసుకోవచ్చు)
  • ఉత్పత్తి 10 సంవత్సరాల పాలసీ వ్యవధి వరకు ఏకైక ప్రీమియం చెల్లింపు వ్యవధి అందిస్తుంది.
  • స్థాయి భద్రత మరియు తగ్గింపు భద్రత ప్లాన్ ఎంపికలు, రెండింటికి సంయుక్త జీవిత భద్రత దొరుకుతుంది.
  • సంయుక్త జీవిత భద్రత కింద, వారు భాగస్వామి, తోబుట్టువులు లేదా తల్లిదండ్రులు, పిల్లలలాంటి సమీప రక్త సంబంధికులు లేదా వ్యాపార భాగస్వాములు అయితే ఇద్దరు వ్యక్తులకు భద్రత కలిగించడం జరుగుతుంది. ప్రత్యామ్నాయ జీవితాలకు భద్రత కలిగించడం జరగదు.

 

లాభాలు:

  • భద్రత: అనూహ్యమైన సంఘటన తలెత్తుతే మీ సమూహ సభ్యుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కలిగిస్తుంది.
  • సౌలభ్యం: మీ సభ్యులకు అందించాలనుకునే బీమా రాశిని ఎంచుకునే ఎంపిక
  • సులభత్వం: వైద్య పరీక్షలు అవసరం ఉండవు, స్వీకరించడం అనేది సంతృప్తికరమైన ఆరోగ్యం వెల్లడి ఆధారంగా ఉంటుంది.
  • అందుబాటు: మాములు ప్రీమియానికే ప్లాన్ లాభాలు.

మృత్యువు లాభం:


దురదృష్టవశాత్తున భద్రతగల వ్యక్తి మరణించినా లేదా సంయుక్త జీవిత పాలసీ విషయంలో భద్రతగల ఎవరైన సభ్యులు ముందు మరణించినా, భద్రత వ్యవధి కొనసాగుతుండగా ఏకమొత్తంలో మృత్యువు లాభాలను చెల్లించడం జరుగుతుంది. సంయుక్త జీవిత పాలసీలో ఇద్దరు సభ్యులు ఒకేసారి మరణిస్తే ఒకే బీమా రాశి చెల్లించడం జరుగుతుంది.
క్రెడిట్ అనుసంధానమైన/ఋణదాత-ఋణగ్రహిత సంబంధం కోసం, మూల బీమా రాశి అనేది సమూహ సభ్యుల కోసం పాలసీ ప్రారంభంలోని కనీస బకాయి లోన్ మొత్తానికి సమానంగా ఉంటుంది.
స్థాయి భద్రత: మృత్యువుతో బీమా రాశి చెల్లించి భద్రత ముగించడం జరుగుతుంది.
తగ్గించే భద్రత: మృత్యువుతో బీమా రాశి అనేది భద్రత ప్రారంభంలో, భద్రత సభ్యుని మృత్యువు తేది నాడు, అందించిన బీమా సర్టిఫికెట్ ప్రణాళిక లోన్ భద్రత బీమా రాశికి సమానం మొత్తాన్ని వాస్తవిక లోన్ బకాయితో సంబంధం లేకుండా లోన్ భద్రత ప్రణాళిక ప్రకారం చెల్లించి మరియు భద్రత ముగించడం జరుగుతుంది.
సంయుక్త జీవితం విషయంలో, మృత్యువు లాభం చెల్లించిన తర్వాత (మొదటి మృత్యువు) బతికివున్న సభ్యుని భద్రత ముగిసిపోతుంది. ఋణదాత-ఋణగ్రహిత స్కీముల విషయంలో, అర్హత సంస్థలలో సభ్యులు/ఉద్యోగి సందర్భంలో, బకాయి లోన్ మొత్తాన్ని మాస్టర్ పాలసీదారుకు చెల్లించడం జరుగుతుంది. అయితే ఇది ప్రారంభంలో సమూహం సభ్యులు మృత్యువు లాభం మరియు బ్యాలెన్స్, ఏవైనా ఉంటే నామిని/లాభానికి అర్హులకు చెల్లించాలని ముందు అధికారం కలిగించిన దానిపై ఆధారపడి ఉంటుంది. అధికారం అందించని పక్షంలో, మృత్యువు లాభాన్ని నామిని లేదా లాభానికి అర్హులకు చెల్లించడం జరుగుతుంది. జీవిత బీమా గలవారు మైనర్ అయితే, అతను/ఆమె మెజర్ స్థాయికి చేరుకోగానే పాలసీ దానంతటదే జీవిత బీమా గలవారికి చెందుతుంది.
అర్హత సంస్థలలో* దిగువ పేర్కొన్న సంస్థలు ఉంటాయి: (i) రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) సంచలిత ప్రమాణిత వాణిజ్య బ్యాంకులు (కోఆపరేటివ్ బ్యాంకులతో సహా), (ii) రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నమోదిత సర్టిఫికెట్గల బ్యాంకింగ్-రహితమైన ఆర్థిక కంపెనీలు (ఎన్‌బిఎఫ్‌సిలు) (iii) నేషనల్ హౌజింగ్ బోర్డ్ (ఎన్‌హెచ్‌బి) సంచలిత గృహ ఋణాల కంపెనీలు, (iv) నేషనల్ మైనారిటి డెవెలొప్‌మెంట్ ఫైనాన్స్ కార్పోరేషన్ (ఎన్‌ఎమ్‌డిఎఫ్‌సి) మరియు వారి రాష్ట్ర చాన్లైజింగ్ ఎజెన్సీలు, (v) రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా సంచలిత చిన్న విత్తీయ బ్యాంక్స్, (vi) ఒకరికొకరు సహకరించుకొని ఏర్పడిన కోఆపరేటివ్ సొసైటీస్ మరియు వర్తించే అలాంటి సొసైటి చట్టం కింద రిజిస్టర్ చేసుకోబడినది, (vii) కంపెనీల చట్టం, 2013 సెక్షన్ 8 కింద రిజిస్టర్ చేసుకోబడిన సూక్ష్మ ఆర్థిక కంపెనీలు లేదా సమయసమయాలకు ఆమోదించబడిన ఇతర శ్రేణిలు.

ఉచితంగా-పరిశీలన వ్యవధి :


1) మాస్టర్ పాలసీదారు ప్రీమియం చెల్లించే పక్షంలో:
ఎలక్ట్రానిక్ పాలసీలు లేదా దూరమైన మార్కెటింగ్ ద్వారా తీసుకున్న పాలసీలు తప్ప, స్వీకరించిన పాలసీ దస్తావేజుకు ఉచితంగా 15 రోజుల పరిశీలన వ్యవధి ఉంటుంది, మరియు ఎలక్ట్రానిక్ పాలసీలు మరియు దూరమైన విధానంతో పొందిన వాటికి నియమాలు మరియు నిబంధనల పరిశీలన కోసం స్వీకరించిన తేది నుంచి 30 రోజుల వ్యవ్యధి ఉంటుంది. మాస్టర్ పాలసీదారు పేర్కొన్న నియమాలు మరియు నిబంధనలు అంగీకరించని పక్షంలో, అభ్యంతరానికి కారణం తెలియజేస్తూ, బీమా తీసినవారికి రద్దు చేసేందుకు పాలసీని తిరిగిపంపవచ్చు, అప్పుడిక అందించిన భద్రత వ్యవధికి అనుగుణంగా రిస్కు ప్రీమియం, మరియు ప్రతిపాదించువారి వైద్య పరీక్షల కోసం బీమా తీయువారు వెచ్చించిన ఖర్చులు మరియు స్టాంప్ డ్యూటీ చార్జీలు కోసుకొని మాత్రమే చెల్లించిన ప్రీమియం తిరిగి ఇవ్వడం జరుగుతుంది.
2) ఒకవేల బీమా తీసుకున్న సభ్యులు ప్రీమియం చెల్లిస్తే:
ఎలక్ట్రానిక్ పాలసీలు లేదా దూరమైన మార్కెటింగ్ ద్వారా తీసుకున్న పాలసీలు తప్ప, స్వీకరించిన బీమా సర్టిఫికెట్‌కు స్వీకరించిన తేది నుంచి ఉచితంగా 15 రోజుల పరిశీలన వ్యవధి ఉంటుంది, మరియు ఎలక్ట్రానిక్ పాలసీలు మరియు దూరమైన విధానంతో పొందిన బీమా సర్టిఫికెట్‌కి నియమాలు మరియు నిబంధనల పరిశీలన కోసం స్వీకరించిన తేది నుంచి 30 రోజుల వ్యవ్యధి ఉంటుంది. బీమా తీసుకున్న సభ్యులు పేర్కొన్న నియమాలు మరియు నిబంధనలు అంగీకరించని పక్షంలో, అభ్యంతరానికి కారణం తెలియజేస్తూ, బీమా తీసినవారికి రద్దు చేసేందుకు బీమా సర్టిఫికెట్‌ని తిరిగి పంపవచ్చు, అప్పుడిక అందించిన భద్రత వ్యవధికి అనుగుణంగా రిస్కు ప్రీమియం, మరియు ప్రతిపాదించువారి వైద్య పరీక్షల కోసం బీమా తీయువారు వెచ్చించిన ఖర్చులు మరియు స్టాంప్ డ్యూటీ చార్జీలు కోసుకొని మాత్రమే చెల్లించిన ప్రీమియం తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఉమ్మడి జీవిత భద్రత ఉంటే, ఒకేసారి ఇద్దరి సభ్యుల జీవిత భద్రత రద్దు చేయడం జరుగుతుంది మరియు ఉచితంగా పరిశీలన రద్దు ఒకేసారి ప్రభావంలోకి తీసుకురావడం జరుగుతుంది. .

మేచ్యురిటి లాభం:


మేచ్యురిటి నాడు ఈ పాలసీ కింద ఎలాంటి లాభాలు చెల్లించడం జరగదు.

అప్పగింత లాభం:


పాలసీ సభ్యులు అప్పగింత విలువ పొందుతారు మరియు పాలసీ వ్యవధి కొనసాగుతుండగా ఎప్పుడైనా అప్పగించుకోవచ్చు. అప్పగింత విలువ గడువు ముగియని రిస్కు ప్రీమియానికి సమానంగా ఉంటుంది మరియు దిగువ విధంగా అందించడం జరుగుతుంది:
  • స్థాయి భద్రత: (70% x చెల్లించిన ఏకైక ప్రీమియం) x [గడువు ముగియని వ్యవధి [నెలలలో/ పూర్తి వ్యవధి (నెలలలో)]
  • తగ్గింపు భద్రత: (70% x చెల్లించిన ఏకైక ప్రీమియం) x [గడువు ముగియని వ్యవధి (నెలలలో/పూర్తి వ్యవధి (నెలలలో)] x [ప్రణాళిక ప్రకారం బీమా రాశి/ ప్రాథమిక బీమా రాశి]
గడువు ముగియని వ్యవధి = నెలలలో పాలసీ వ్యవధి నుంచి అప్పగింత తేది నాటి పాలసీ నెలలను తీసివేయడం.
అప్పగింతతో, అన్ని లాభాలు మరియు సభ్యుని (ల) భద్రత ముగిసిపోతుంది. ఏకమొత్తం లాభం రూపంలో అప్పగింత విలువను చెల్లించడం జరుగుతుంది మాస్టర్ పాలసీదారు పాలసీని అప్పగించిన పక్షంలో, వారి సంబంధిత భద్రత ముగింపు వరకు సభ్యులకు వారి భద్రతను కొనసాగించుకునే ఎంపిక ఉంటుంది. భద్రత కొనసాగించుకునే ఇష్టం లేని సభ్యులకు అప్పగింత విలువ చెల్లించి భద్రత ముగించడం జరుగుతుంది.

సంయుక్త జీవిత భద్రత:

  • ఋణదాత-ఋణగ్రహిత సమూహాలకు మాత్రమే సంయుక్త జీవిత భద్రత అందుబాటులో ఉంటుంది.
  • ఇది స్థాయి భద్రత మరియు తగ్గింపు భద్రత ఎంపికలు రెండింటికి అందుబాటులో ఉంటుంది.
  • భాగస్వామి, తోబుట్టువులు లేదా తల్లిదండ్రులు, పిల్లలలాంటి సమీప రక్త సంబంధికులు లేదా వ్యాపార భాగస్వాములు అయితే ఇద్దరు వ్యక్తులకు భద్రత కలిగించడం జరుగుతుంది. ప్రత్యామ్నాయ జీవితాలకు భద్రత కలిగించడం జరగదు.
  • పూర్తి బకాయి లోన్ మొత్తానికి ప్రతి ఋణగ్రహితకు బీమా - అదే బీమా రాశి మరియు అదే పాలసీ వ్యవధికి. ఋణగ్రహితలలో ఏ ఒక్కరు మరణించినా, మృత్యువు లాభాన్ని చెల్లించి బతికివున్న ఋణగ్రహిత భద్రతను ముగించడం జరుగుతుంది.

గ్రేస్ వ్యవధి:


వర్తించదు
చెల్లించవలసిన బకాయి ప్రీమియం బీమా తీసుకున్నవారి ద్వారా మాస్టర్ పాలసీదారుకు చెల్లించడం జరిగి మరియు బీమా తీసుకున్న సభ్యులకు ప్రీమియం స్వీకృతి లేదా రసీదు అందినప్పటికి, గ్రేస్ వ్యవధిలో మాస్టర్ పాలసీదారు ద్వారా బీమా తీసినవారికి అందించడం జరగని సందర్భం. తదనంతరం క్లెయిం సంభవిస్తే, దానిని స్వీకరించడం జరుగుతుంది, అయితే క్లెయిం స్వీకరించి మరియు చెల్లింపులు జరిపేలా ఉండాలి. ఇది మాస్టర్ పాలసీదారు ద్వారా సంబంధిత దస్తావేజుల సమర్పణ మేరకు ఉంటుంది, బీమా తీసుకున్న సభ్యులు మాస్టర్ పాలసీదారుకు చెల్లించవలసిన అన్ని ప్రీమియమ్స్ చెల్లింపులకు లోబడి ఉంటుంది. బీమా తీసినవారికి చెల్లించవలసిన ప్రీమియం అందిన తర్వాత మాత్రమే క్లెయిం మొత్తాన్ని చెల్లించడం జరుగుతుంది.

ఆత్మహత్య క్లెయిం ఏర్పాట్లు:


ఆత్మహత్య మూలంగా బీమా తీసుకున్న సభ్యులు మరణిస్తే, సభ్యుని రిస్కు ప్రారంభ తేది నుంచి 12 నెలలలోపున పాలసీదారు నామిని లేదా లాభానికి అర్హులు చెల్లించిన పూర్తి ప్రీమియమ్స్ యొక్క 80%కి అర్హత పొందుతారు, మృత్యువు తేది వరకు, లేదా అప్పగింత విలువ, మృత్యువు తేది నాటికి ఏదైనా ఉంటే, ఏది ఎక్కువైతే దానిని చెల్లించడం జరుగుతుంది, అయితే దీని కోసం పాలసీ సభ్యుని పాలసీ అమలులో ఉండాలి. వర్తించే విధంగా లాభాన్ని చెల్లించిన తర్వాత, సభ్యుని పాలసీ రద్దుచేయడం జరుగుతుంది. చెల్లించిన మొత్తం ప్రీమియమ్స్ అంటే, ఏదైనా అదనపు ప్రీమియం మరియు పన్నుల మినహాయింపుతో చెల్లించిన అన్ని ప్రీమియమ్స్ మొత్తం.

పునరుద్ధరణ సదుపాయం:


వర్తించదు

ఎస్‌బిఐ లైఫ్ - గ్రూప్ మైక్రో షిల్డ్ - ఎస్‌పి కి సంబంధించిన రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనల పూర్తి వివరాల కోసం దిగువ పేర్కొన్న  డాక్యుమెంట్లను  శ్రద్ధగా చదవండి.

SBI Life- Group Micro Shield - SP Plan Premium
*చివరి పుట్టినరోజు నాటి వయసు.
**అన్ని ఎస్‌బిఐ లైఫ్ గ్రూప్ మైక్రో ఇన్సూరెన్స్ ఉత్పత్తులకు జమా బీమా రాశిని ప్రతి సమూహ సభ్యుని రూ. 2,00,000 వద్ద క్యాప్ చేయడం జరుగుతుంది.
^వర్తించే పన్ను నియమాల ప్రకారం సమయ సమయాలకు భారతదేశ రాష్ట్రప్రభుత్వం లేదా కేంద్ర పభుత్వం నిర్ధేశించిన ప్రకారం ప్రీమియం పైన వర్తించే పన్నులు మరియు/లేదా ఇతర చట్టబద్ధమైన సుంకాలు/ప్రీమియం పైన సర్‌చార్జీ చెల్లించవలసి ఉంటుంది.
$సభ్యుని స్థాయిలో పేర్కొన్న పాలసీ వ్యవధి వర్తిస్తుంది. ఏకైక ప్రీమియం పాలసీ కింద అందించే పాలసీ వ్యవధి 1 నుంచి 120 నెలలు (రెండు కలుపుకొని) మరియు సమూహం స్థాయిలో 1 దాని గుణాంకంలో (అంటే 1 నెల, 2 నెలలు.... 119 నెలలు మరియు 120 నెలలు). సభ్యుల వ్యవధి గడువు ముగింపు వరకు మాస్టర్ పాలసీ కొనసాగుతుంది. క్రెడిట్ అనుసంధానమైన/ఋణదాత-ఋణగ్రహిత సంబంధం కోసం, పాలసీ వ్యవధి సమూహం సభ్యుని కోసం కనీసం పాలసీ ప్రారంభంలోని బకాయి లోన్ మొత్తానికి సమానంగా ఉండాలి.

 

3A/ver1/02/23/WEB/TEL

*పన్ను ప్రయోజనాలు:
కాలానుగుణంగా భారతదేశంలోని వర్తించే ఆదాయం పన్ను చట్టాలు ప్రకారం మీరు పన్ను ప్రయోజనాలు/ మినహాయింపులకు అర్హత పొందుతారు, అది నియమాల ప్రకారం సమయ సమయానికి మార్పుకు లోబడి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారున్ని సంప్రదించండి.

కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకునే ముందు రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం దయచేసి అమ్మకాల బ్రోచర్‌ని శ్రద్ధగా చదవండి.