ఋణ సంరక్షణ బీమా ప్లాన్ | ఎస్‌బిఐ లైఫ్ - ఋణ రక్ష
SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

ఎస్‌బిఐ లైఫ్ - ఋణ రక్ష

UIN: 111N078V03

ఉత్పత్తి కోడ్ : 70

ఎస్‌బిఐ లైఫ్- ఋణ రక్ష

మీ కుటుంబం సంతోషాలను వారసత్వంగా తీసుకుంటుంది.
మీ బాధ్యతలను కాదు.

సామూహిక, నాన్‌-లింక్డ్, నాన్‌-పార్టిసిపేటింగ్‌, క్రెడిట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఉత్పత్తి.

సమర్పిస్తున్నాము ఎస్‌బిఐ లైఫ్ - ఋణ రక్ష (UIN: 111N078V03), మీ కుటుంబానికి అన్నింటికంటే అత్యుత్తమమైనది అందించేందుకు తోడ్పడే ప్లాన్. ఈ పరిష్కారంతో, ఏదైనా దురదృష్టకరమైన సంఘటన తలెత్తుతే మీ కుటుంబం పైన లోన్ చెల్లించవలసిన బాధ్యత ఉండదు, ఎందుకంటే ఇది బకాయి లోన్‌ని తిరిగి చెల్లిస్తుంది. ఈ విధంగా భవిష్యత్తుకు మరియు కలలకు భద్రత ఉంటుంది.

ప్రత్యేకతలు :
  • విస్తృత సామూహిక క్రెడిట్ లైఫ్ ప్లాన్, ఇది ఇల్లు, వాహనం, విద్యాభ్యాసం, వ్యక్తిగత మరియు ఇతర లోన్స్‌కు భద్రత అందిస్తుంది.
  • ప్రాథమిక అప్పు తీసుకున్నవారితో పాటు అదనంగా 2 వరకు సహ-అప్పుతీసుకున్నవారికి.
  • అవసరం ప్రకారం లోన్ భద్రత వ్యవధిని ఎంచుకునే సౌలభ్యం**

*ఉత్పత్తి కింద కొత్త మరియు ప్రస్తుత అప్పు తీసుకునేవారికి భద్రత బోర్డ్ ఆమోదించిన అండర్‌వ్రైటింగ్ పాలసీ ప్రకారం ఉంటుంది
**లోన్ వ్యవధి 15 సంవత్సరాలు లేదా ఆపైన ఉంటే కనీసం 2/3 వంతు లోన్ వ్యవధికి లోబడి ఉంటుంది.

ముఖ్యాంశాలు

ఎస్‌బిఐ లైఫ్ - ఋణ రక్ష

సామూహిక, నాన్‌-లింక్డ్, నాన్‌-పార్టిసిపేటింగ్‌, క్రెడిట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తి.

ప్రత్యేకతలు

  • జీవిత బీమా భద్రత
  • పలు రకాల ఋణాలు తిరిగిచెల్లించే సహకారం
  • సహ ఋణ-గ్రహితలకు భద్రత
  • గోల్డ్ లేదా ప్లాటినం ప్లాన్ ఎంచుకునే ఎంపిక
  • భద్రత వ్యవధి,  ప్రీమియం చెల్లించే వ్యవధి మరియు ఫ్రీక్వెన్సీ ఎంపిక

ప్రయోజనాలు

భద్రత
  • మీరు ఎంతో ప్రేమగా ఆర్జించిన ఆస్తిని  మీ కుటుంబీయులు ఆనందించేలా చేస్తుంది
విశ్వసనీయత
  • బీమా రాశి ప్రణాళిక ప్రకారం బకాయి ఋణం మొత్తాన్ని తిరిగి చెల్లిస్తుంది
  • విస్తృత శ్రేణి ఋణాలకు భద్రత అవి, గృహ ఋణాలు, కారు ఋణాలు, వ్యవసాయ ఋణాలు, విద్యాభ్యాసం ఋణాలు మరియు వ్యక్తిగత ఋణాలు
సౌలభ్యం
  • ప్రాథమిక ఋణ గ్రహితతో పాటు ఇద్దరు సహ-ఋణ గ్రహితలకు అదనపు భద్రతను అందిస్తుంది
  • మీ అవసరాల ప్రకారం 5 లేదా 10 సంవత్సరాలకు ఏకైక లేదా స్థాయి ప్రీమియం మధ్యలో ఎంచుకోండి
  • మీ ఆర్థిక సామర్థ్యాల ప్రకారం నెలనెల, మూడు నెలలు, ఆరు నెలలు లేదా వార్షిక ప్రీమియమ్స్ ఎంపిక
పన్ను లాభాలను పొందండి*

సమూహం నిర్వహకుల స్థాయిలో మీ మాస్టర్ పాలసీదారు ద్వారా ఈ ప్లాన్‌లోని ప్రత్యేకతలను ఎంచుకునే వీలుం టుంది. మాస్టర్ పాలసీదారు ఎంచుకున్న ప్రత్యేకతలు మాత్రమే మీకు అందుబాటులో ఉంటాయి. మాస్టర్ పాలసీదారు అందించే ఎంపికలు/ప్రత్యేకతల నుంచి మీరు ఎంచుకోవచ్చు.

మృత్యువు లాభం:

మీ బీమా సర్టిఫికెట్ ప్రణాళిక ప్రకారం మృత్యువు భద్రత అనేది మృత్యువు సమయం నాటి బకాయి ఋణం బ్యాలెన్స్‌గా ఉంటుంది.

పన్ను ప్రయోజనాలు*:

ఆదాయం పన్ను ప్రయోజనాలు/మినహాయింపులు భారతదేశంలో వర్తించే ఆదాయ పన్ను చట్టాల ప్రకారం ఉంటాయి, ఇవి కాలానుగుణంగా మార్పుకు లోబడి ఉంటాయి.  వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారున్ని సంప్రదించండి.

ఎస్‌బిఐ లైఫ్‌ - ఋణ రక్షకి సంబంధించిన రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనల పూర్తి వివరాల కోసం దిగువ పేర్కొన్న  డాక్యుమెంట్లను  శ్రద్ధగా చదవండి.

null
^వయసుకు సంబంధించిన అన్ని సూచికలు చివరి పుట్టిన రోజు నాటివి.

70/ver1/11/24/WEB/TEL

కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకునేముందు రిస్క్ అంశాలు, నియమాలు మరియు నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం దయచేసి అమ్మకాల బ్రోచర్‌ని శ్రద్ధగా చదవండి.

*పన్ను ప్రయోజనాలు:
పన్ను లాభాలు, ఆదాయ పన్ను నియమాల ప్రకారం ఉంటాయి మరియు కాలానుగుణంగా మార్పునకు లోబడి ఉంటాయి. వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారుని సంప్రదించండి. కాలానుగుణంగా భారతదేశంలోని వర్తించే ఆదాయం పన్ను చట్టాల ప్రకారం మీరు పన్ను ప్రయోజనాలు/ మినహాయింపులకు అర్హత పొందుతారు, అది నియమాల ప్రకారం కాలానుగుణంగా మార్పునకు లోబడి ఉంటాయి. మరిన్ని వివరాల కోసం, ఇక్కడ క్లిక్ చెయ్యండి. వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారున్ని సంప్రదించండి.