శీతాకాలంలో మీ చర్మాన్ని మృదువుగానూ ప్రకాశవంతంగానూ ఉంచడానికి 5 ముఖ్య చిట్కాలు
శీతాకాలంలో మీ చర్మాన్ని మృదువుగానూ ప్రకాశవంతంగానూ ఉంచడానికి 5 ముఖ్య చిట్కాలు
భారతదేశంలో శీతాకాలం వచ్చింది, ఇది వాతావరణాన్ని చల్లగా ఉంచుతుంది, ఈ కాలంలో తక్కువ తేమ ఉంటుంది.శీతాకాలపు ఉదయాలు ఆహ్లాదకరంగానూ, ఉల్లాసంగానూ ఉన్నప్పటికీ, అవి గాలిని పొడిగా ఉంచుతాయి, చర్మంపై తేమని ఆరిపోయేలా చేస్తాయి.వెంటనే జాగ్రత్త తీసుకోకపోతే చర్మం గరుకుగానూ, పెళుసుగానూ మారుతుంది.పొడి చర్మం కూడా రక్తస్రావానికి దారితీస్తుంది.స్కిన్-మాయిశ్చరైజర్లు కొంతవరకూ ఉపయోగపడినప్పటికీ, పొడిబారడం, దురద, ఎర్రబారడం మొదలైన సమస్యల్ని తగ్గించడానికి చర్మానికి మంచి జాగ్రత్తలు తీసుకోవాలి.చర్మం మెరుపులీనేలా చేసే ఈ సులభమైన, ప్రభావవంతమైన చిట్కాలతో ఇబ్బందికరమైన శీతాకాలంలో కూడా మీ చర్మాన్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో తెలుసుకుందాం.
1. చేతుల్నీ, ముఖాన్నీ గోరువెచ్చటి నీటితో కడగాలి.
శీతాకాలంలో వేడి నీటితో స్నానం చేయడం కంటే శ్రేష్ఠమైనది మరొకటి లేదు.అయినా సరే, మీకు అవకాశం దొరికినప్పుడల్లా, మీ ముఖాన్నీ చేతుల్నీ గోరువెచ్చని నీటితో కడుక్కుంటూ ఉండాలి.ఇది మీ చర్మానికి పోషణనీ, తేమనీ సంరక్షిస్తుంది. అయితే, వేడినీళ్ల వాడటం వల్ల మీ చర్మంపై ఉండే సహజ నూనెలు తొలగిపోతాయని కూడా మీరు గుర్తుంచుకోవాలి.కాబట్టి దాని గురించి జాగ్రత్తగా ఉండండి.
2. మీ చర్మాన్ని తేమగా ఉండేలా చేసుకోండి
మీ ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కుంటే సరిపోతుందని అనుకోకూడదు, ఎందుకంటే క్రీమ్, మాయిశ్చరైజర్‌తో మరింత ఎక్కువ తేమ అవసరమవుతుంది.బాత్రూమ్‌లోనే మాయిశ్చరైజర్‌ను అందుబాటులో ఉంచండి.చర్మం తడిగా ఉన్నప్పుడు మాయిశ్చరైజర్‌ను అప్లై చేయండి, ఆ విధంగా చేస్తే తేమ చర్మంలోనే ఉండిపోతుంది.అంతేకాకుండా, మీ చర్మసంరక్షణ కోసం వాష్ చేసుకున్నప్పుడల్లా మాయిశ్చరైజర్‌ని ఉపయోగిస్తూ ఉండండి.
3. మీ చర్మాన్ని రక్షించుకోండి
మీ చర్మాన్ని తేమగా ఉంచడం ఎంత అవసరమో, చల్లని వాతావరణం నుండి రక్షించుకోవడం కూడా అంతే ముఖ్యం.చలి రోజుల్లో స్వెటర్, గ్లౌజుల్ని ధరించండి, అలాగే మీ ముఖాన్ని స్కార్ఫ్‌తో కప్పుకోండి.అలాగే, శీతాకాలం అయినా, మీ చర్మం వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉన్నందున సన్‌స్క్రీన్‌ను పూయడం మర్చిపోవద్దు.
4. రాత్రిపూట తేమ
సాధారణంగా, ఎవరైనా స్నానం చేసిన తర్వాత చర్మ సంరక్షణ క్రీముల్నీ, మాయిశ్చరైజర్లనీ రాసుకుంటారు.అయితే, రాత్రిపూట చర్మం పొడిబారుతుందని వారు మర్చిపోతారు.అందుకే మీరు నిద్రపోయే ముందు స్కిన్ మాయిశ్చరైజర్లను ఉపయోగించాలి.ఇది రాత్రంతా మీ చర్మసంరక్షణ చేస్తుంది.అంతేకాకుండా, ఆ తేమను బయటకి పోకుండా చేయడానికి కాటన్ గ్లోవ్స్ మరియు సాక్స్ ధరించండి.ఇది చర్మాన్ని మృదువుగా ఉండేలా చేస్తుంది.
5. మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్ గా ఉంచుకోండి
శీతాకాలంలో లోపలి నుంచి బయట దాకా హైడ్రేటెట్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం.మీ శరీరానికి తగినంత తేమనిచ్చే ఆహారాన్ని తినండి.
అలాగే, పుష్కలంగా నీరు త్రాగండి.కివి, నారింజ, ఆపిల్ వంటి పండ్లు, టమోటాలు, దోసకాయ, సెలెరీ, క్యారెట్లు వంటి కూరగాయలు తినండి.
కొల్లాజెన్ ఉత్పన్నం కావడానికీ, అది దీర్ఘకాలం నిలిచి ఉండటానికీ అవసరమయ్యేంతగా మీ విటమిన్ సి మరియు జింక్ అందేలా మీరు చూసుకోవాలి.
అన్ని సీజన్లలోనూ, ముఖ్యంగా శీతాకాలంలో చర్మ సంరక్షణ చాలా ముఖ్యం; ఈ పని కొంచెం సవాలుగా మారుతుంది.చలిగానూ, పొడిగానూ ఉన్న వాతావరణం చర్మాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది, కాబట్టి మంచి చర్మ రక్షణ అవసరం.ఈ చర్మాన్ని ప్రకాశించే చిట్కాలను అనుసరించడం సులభం, ఇవి శీతాకాలంలో మీరు సరైన చర్మసంరక్ణణ చేసుకునేందుకు మీకు ఉపకరిస్తాయి.ఈ శీతాకాలమంతా మృదువైన, ఆరోగ్యకరమైన చర్మాన్ని ఆనందించండి.