కోవిడ్-19 రెండవ దశలో మీరు తీసుకోవలసిన జాగ్రత్తలను తెలుసుకోండి
లాక్డౌన్ సమయంలో మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి మార్గాలు
కరోనావైరస్ ప్రపంచాన్ని స్తంభింపజేసినట్లు కనిపిస్తోంది. జూన్ 22, 2020 నాటికి, భారతదేశంలోనే దాదాపు 13,700 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అందించిన డేటా తెలిపింది. కానీ ఈ మహమ్మారి ప్రజల శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా, మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తోంది.
ఈ వ్యాధి బారిన పడతామనే భయమే కాకుండా, లాక్‌డౌన్ ఆర్థికంగా కూడా తీవ్ర ప్రభావాన్ని చూపింది. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు, అలాగే మహమ్మారి కారణంగా వ్యాపారాలు అంతగా రాణించడం లేదు. వాస్తవానికి, మహమ్మారి సమయంలో మానసిక ఆరోగ్య సమస్యల సంఖ్యలో 20% పెరుగుదల ఉందని ఇండియన్ సైకియాట్రీ సొసైటీ అధ్యయనం తెలిపింది.
కానీ చాలామందికి మానసిక ఆరోగ్యాన్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో తెలియదు. మీరు కూడా అదే విషయం గురించి ఆలోచిస్తుంటే, మీ కోసం ఇక్కడ కొన్ని ఉపయోగకరమైన చిట్కాలు ఉన్నాయి.
కోవిడ్-19 రెండవ దశలో మీరు తీసుకోవలసిన జాగ్రత్తలను తెలుసుకోండి
రెండవ విడత వ్యాపించిన కరోనావైరస్భా రతదేశాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. వైరస్ పరివర్తన చెందిందనీ, ఇప్పుడు మరింత ప్రమాదకరంగా మారిందనీ నివేదించబడింది.అలాగే, కేసుల సంఖ్య ప్రతిరోజూ పెరుగుతోంది, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ దానిని కొనసాగించడానికి కష్టపడుతోంది.అటువంటి సందర్భంలో, మిమ్మల్నీ, మీ ప్రియమైన వారినీ సురక్షితంగా ఉంచుకోవడం గతంలో కంటే చాలా ముఖ్యం.
రెండవ విడత కోవిడ్-19 ఎదుర్కొంటున్నప్పుడు మీరు తప్పనిసరిగా తీసుకోవలసిన జాగ్రత్తలను ఆరోగ్య అధికారులు సూచించారు.
వ్యక్తులను శారీరకంగా కలవడం, మీ ఇంటికి అతిథులను ఆహ్వానించడం మానుకోండి.
ఎంఓహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ (ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ) ఇచ్చిన వివిధ సలహాల ప్రకారం, వైరస్ ఇప్పుడు మరింత సులభంగా వ్యాపిస్తుంది. కోవిడ్-19 బారిన పడిన చాలా మంది వ్యక్తులు లక్షణాలు లేకుండా ఉంటారు కాబట్టి, సరైన పరీక్ష లేకుండా కరోనావైరస్ సంక్రమణను గుర్తించడం కష్టం. అందువల్ల, మీరు వ్యక్తులను శారీరకంగా కలవడం లేదా వారిని మీ ఇంటికి ఆహ్వానించడం మానుకోవాలి. అలాగే, రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండండి, ఎందుకంటే అలాంటి ప్రదేశాల్లో చాలా తీవ్రంగా వైరస్ వ్యాపిస్తుంది.
ప్రయాణం చేయవద్దు
గత సంవత్సరం లాక్‌డౌన్ కారణంగా మీ ప్రయాణ ప్రణాళికలు నిలిపివేయబడి ఉండవచ్చు. ఇది బయటకు వెళ్లి ప్రయాణించడానికి ప్రేరణగా ఉండవచ్చు. అయితే, రెండవ వేవ్ సమయంలో ప్రయాణించడం అధిక-రిస్క్‌తో కూడిన పని. కరోనావైరస్ బారిన పడే అవకాశాలు మునుపటితో పోలిస్తే ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల, ప్రస్తుతానికి మీ ప్రయాణ ప్రణాళికలను రద్దు చేసుకోవడం లేదా వాయిదా వేయడం మంచిది.
మీరు బయటకు అడుగుపెట్టిన ప్రతిసారీ పాటించాల్సిన ఆరోగ్య ప్రోటోకాల్‌లు
మీరు బయట ఉన్నప్పుడు ఫేస్ మాస్క్ అత్యుత్తమ రక్షణను అందిస్తుంది. వైరస్ యొక్క ఉత్పరివర్తనను పరిగణనలోకి తీసుకుని, సీడీసీ మాస్క్ మార్గదర్శకాలను నవీకరించింది.
డబుల్ మాస్క్‌లు ధరించడం మంచిది. ఒక ప్రభావవంతమైన టెక్నిక్ ఏమిటంటే, ఒక క్లాత్ మాస్క్ కింద డిస్పోజబుల్ మాస్క్‌ను ఉపయోగించడం. అలాగే, మీ మాస్క్ మీ ముఖంపై సరిగ్గా అమరి ఉండేలా చూసుకోండి.వైర్ ఉన్న మాస్క్‌ను ఎంచుకోండి, ఎందుకంటే అది మీ ముఖానికి మరింత చక్కగా సరిపోతుంది.
ఆరోగ్య అధికారులు సూచించినట్లుగా, మీరు బయటకు అడుగుపెట్టినప్పుడల్లా ఇతరుల నుండి కనీసం 1 మీటర్ దూరం పాటించండి. సబ్బు మరియు నీటితో చేతులు కడుక్కోండి మరియు 60% ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్‌ను తరచుగా వాడండి. హైడ్రేటెడ్‌గా ఉండండి మరియు విశ్రాంతి తీసుకోండి.
సిద్ధంగా ఉండండి
గత సంవత్సరం మనకు ఏదైనా నేర్పించినట్లయితే, ఆ అనుభవంతో సిద్ధంగా ఉండాలి. మీ దగ్గర పల్స్ ఆక్సిమీటర్, థర్మామీటర్, చేతి తొడుగులు మరియు ఇతర పీపీఈల వంటి ఉపకరణాలు ఉండాలి. అలాగే, మీ నగరంలోని అధికారిక కోవిడ్-19 హెల్ప్‌లైన్, అధికారుల పరిచయాలు మరియు కోవిడ్-19 వార్ రూమ్స్‌తో సహా అత్యవసర పరిచయాల జాబితాను తయారు చేయండి. పారాసెటమాల్ వంటి ప్రాథమిక మందులను అందుబాటులో ఉంచుకోవడం కూడా మంచిది. అయితే, మీరు సొంత వైద్యం చేసుకోకుండా లేదా మందులను నిల్వ చేసుకోకుండా చూసుకోండి.
లక్షణాలను గమనిస్తూ ఉండండి
సీడీసీ (వ్యాధి నియంత్రణ మరియు నివారణ కేంద్రాలు), డబ్ల్యూహెచ్‌ఓ (ప్రపంచ ఆరోగ్య సంస్థ) మరియు ఎంఓహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ వైరస్ వల్ల కలిగే లక్షణాలను నిరంతరం అప్‌డేట్ చేస్తున్నాయి.రెండవ విడతలో కొన్ని అదనపు లక్షణాలు కనిపిస్తున్నాయని నివేదించబడింది.ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండండి, ఈ లక్షణాలలో ఏవైనా కనిపిస్తే పరీక్ష చేయించుకోండి.ఫలితం పాజిటివ్‌గా వస్తే, మీరు సెల్ఫ్-ఐసోలేషన్‌లో ఉండటం కూడా అవసరం.మీరు ఇంట్లో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండలేకపోతే, మీరు అధికారులను సంప్రదించవచ్చు, వారు మీ బస కోసం ప్రత్యేక కోవిడ్-19 సంరక్షణ కేంద్రంలో ఏర్పాట్లు చేయగలరు.
దీనితో పాటు, మీరు కోవిడ్-19 టీకా తీసుకోవడం ద్వారా ఆ వైరస్ నుండి మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోగలరని కూడా ఆలోచించవచ్చు.అలాగే, ఎప్పటికప్పుడు వెలువడే తాజా మార్గదర్శకాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి.ఒకవేళ మీకు ఇన్ఫెక్షన్ సోకినట్లయితే, భయాందోళనలకు గురికాకుండా ఉండండి, సంబంధిత అధికారులను సంప్రదించండి, మీ వైద్యుడిని సంప్రదించండి మరియు ఆరోగ్య సంరక్షణ సంస్థల అధికారిక వెబ్‌సైట్‌లలో జాబితా చేయబడిన అవసరమైన చర్యలు తీసుకోండి.
#యునైట్2ఫైట్ కరోనా
మూలం:
WHO, MoHFW & CDC