సూక్ష్మ అవధి భరోసా ప్లాన్ | ఎస్‌బిఐ లైఫ్ గ్రామీణ సూపర్ సురక్ష
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

ఎస్‌బిఐ లైఫ్ - గ్రామీణ్ సూపర్ సురక్ష

UIN: 111N039V04

ఉత్పత్తి కోడ్ : 96

ఎస్‌బిఐ లైఫ్ - గ్రామీణ్ సూపర్ సురక్ష

అందుబాటైన ప్రీమియంతోనే
జీవితంలో అత్యధిక ఆనందాలను పొందండి.

ఒక గ్రూప్ నాన్‌-లింక్డ్, నాన్‌-పార్టిసిపేటింగ్‌, ప్యూర్ రిస్క్ ప్రీమియం, మైక్రో లైఫ్‌ ఇన్సూరెన్స్ ఉత్పత్తి.

అందుబాటులో ప్రీమియంతో జీవిత బీమా రక్షణను మీ సమూహ సభ్యులకు అందించడంలో మీకు ఆసక్తి ఉందా?

ఎస్‌బిఐ లైఫ్ – గ్రామీణ్ సూపర్ సురక్షతో మీ సమూహ సభ్యులకు అందుబాటులో ప్రీమియంలతో మీరు ఇప్పుడు బీమాను అందించవచ్చు మరణం సంభవించిన సందర్భంలో మీ సమూహ సభ్యులు తమ కుటుంబ ఆర్థిక అవసరాలకు భద్రత కల్పించడానికి ఈ ప్లాన్ తోడ్పడుతుంది.

ఎస్‌బిఐ లైఫ్ – గ్రామీణ్ సూపర్ సురక్ష ప్లాన్ అందిస్తుంది -
  • భద్రత – మీ సభ్యులకు కవరేజి అందిస్తుంది మరియు మరణం సంభవించిన సందర్భంలో వారి కుటుంబాలకు భద్రత కల్పిస్తుంది
  • సౌలభ్యం – ప్రీమియం చెల్లింపు ఎంపికను ఎంచుకునే సౌలభ్యం
  • సరళత – సులభమైన ప్రవేశ ప్రక్రియ ద్వారా
  • చౌకైనది – సముచిత ప్రీమియంలతో

మీ సమూహ సభ్యులకు భద్రతా బహుమతిని ఇవ్వండి.

ముఖ్యాంశాలు

ఎస్‌బిఐ లైఫ్ - గ్రామీణ్ సూపర్ సురక్ష

ఒక గ్రూప్ నాన్‌-లింక్డ్, నాన్‌-పార్టిసిపేటింగ్‌, ప్యూర్ రిస్క్ ప్రీమియం, మైక్రో లైఫ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తి

ప్రత్యేకతలు

  • మీ సమూహ సభ్యులకు టర్మ్ ఇన్సూరెన్స్
  • ఏకైక లేదా క్రమబద్ధమైన వార్షిక ప్రీమియం చెల్లింపు విధానం ఎంపిక
  • వైద్య పరీక్ష ఏదీ అవసరం లేదు
  • భద్రత వ్యవధి
  • ఏకైక ప్రీమియం పాలసీలకు 3 నెలల నుంచి 60 నెలలు (1 సంవత్సరం గుణాంకాలలో)
  • క్రమబద్ధమైన ప్రీమియం పాలసీలకు 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు (1 సంవత్సరం గుణాంకాలలో)

 ప్రయోజనాలు

భద్రత
  • మరణం సంభవించినట్లయితే మీ సమూహ సభ్యుల కుటుంబాల ఆర్థిక ప్రయోజనాలకు భద్రత చేకూర్చుతుంది
సౌలభ్యం
  • మీ సభ్యులకు మీరు ప్రతిపాదించదలిచిన హామీ మొత్తాన్ని ఎంచుకునే అవకాశం
  • సింగిల్ ప్రీమియం లేదా వార్షిక ప్రీమియం మధ్య ప్రీమియం చెల్లింపును ఎంచుకోవచ్చు
సరళత
  • వైద్య పరీక్షలు ఏవీ అవసరం లేదు, సంతృప్తికరమైన ఆరోగ్య ప్రకటనలపై ఆధారపడి ఆమోదించబడుతుంది
చౌకైనది
  • నామమాత్రపు ప్రీమియంలతో ప్లాన్ ప్రయోజనాలు

పొందండి పన్ను లాభాలు*

మృత్యువు లాభాలు:

పాలసీ వ్యవధి కొనసాగుతుండగా జీవిత బీమా తీసుకున్నవారు మరణిస్తే, ఎంచుకున్న బీమా రాశి చెల్లించడం జరుగుతుంది, అయితే దీని కోసం పాలసీ అమలులో ఉండాలి.

 

మేచ్యురిటి లాభాలు :

ఇది ప్యూర్ రిస్క్ ప్రీమియం ఉత్పత్తి అయినందున, ఈ ప్లాన్ కింద ఎలాంటి మేచ్యురిటి లాభాలు చెల్లించడం జరగదు

ఇతర సమాచారం


అప్పగింత 
  • 12 నెలలు పూర్తి అయిన తర్వాత, అమలులో ఉన్న పాలసీలకు మాత్రమే, మాస్టర్ పాలసీదారు లేదా వ్యక్తిగత బీమా తీసుకున్న సభ్యుల అభ్యర్థన మేరకు అప్పగింత విలువ చెల్లించడం జరుగుతుంది. 13 నెలలు లేదా ఆపైనగల పాలసీ వ్యవధికి, ఏకైక ప్రీమియం పాలసీలకు అప్పగింత విలువ చెల్లించడం జరుగుతుంది

గ్రేస్ వ్యవధి
  • క్రమబద్ధమైన ప్రీమియం పాలసీలకు, ప్రీమియం చెల్లించవలసిన గడువు ముగింపు తేది నుంచి 30 రోజుల గ్రేస్ వ్యవధి అనుమతించడం జరుగుతుంది

పునరుద్ధరణ
  • క్రమబద్ధమైన ప్రీమియం చెల్లింపు విధానంలో, పాలసీ వ్యవధి ముగింపుకు ముందు, సమూహ సభ్యులకు సభ్యుల జీవిత భద్రతను పునరుద్ధరించే ఎంపికను ఎంచుకునే వీలుంటుంది.  అయితే  ఇది వర్తించే విధంగా బోర్డ్ ఆమోదించిన అండర్‌వ్రైటింగ్ పాలసీ మరియు వడ్డీకి లోబడి ఉంటుంది.
 
  • ఉచితంగా పరిశీలన వ్యవధి
    ఒకవేళ సమూహ సభ్యులు (స్వేచ్ఛతో కూడిన స్కీముల విషయంలో)/ మాస్టర్ పాలసీదారు జారీ చేసిన బీమా సర్టిఫికెట్/ మాస్టర్ పాలసీ నియమాలు మరియు నిబంధనలతో సంతృప్తి చెందక మరియు ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలనుకుంటే, డిస్టెన్స్ మార్కెటింగ్ మరియు ఎలక్ట్రానిక్ పాలసీలు కాకుండా ఇతర మాధ్యమాల ద్వారా జారీ చేసిన బీమా సర్టిఫికెట్/ మాస్టర్ పాలసీలకు స్వీకరించిన  
    15 రోజుల లోపున మరియు డిస్టెన్స్ మార్కెటింగ్ మరియు ఎలక్ట్రానిక్ పాలసీల ద్వారా స్వీకరించిన పాలసీల కొరకు బీమా సర్టిఫికెట్/మాస్టర్ పాలసీల విషయంలో స్వీకరించిన తేది నుంచి 30 రోజులలో రద్దు చేసుకునే కారణం తెలియజేసే పత్రంతో అతను/ఆమె పాలసీని కంపెనీకి తిరిగి ఇవ్వవచ్చు.  చెల్లించిన ప్రీమియాన్ని బీమా తీసినవారు వైద్య పరీక్షల ఖర్చులు, ఏవైనా ఉంటే, స్టాంప్ డ్యూటి ఖర్చు మరియు వర్తించే పన్నులు, ఏవైనా ఉంటే కోసుకొని చెల్లిస్తారు. సభ్యుల విషయంలో భద్రత వ్యవధి నిష్పత్తి రిస్కు ప్రీమియాన్ని కూడా కోసుకోవడం జరుగుతుంది.

అప్పు సౌలభ్యత
  • ఈ ప్లాన్ క్రింద అప్పు సౌలభ్యత ఏదీ అందుబాటులో లేదు

నిరాకరణలు
  • ఆత్మహత్య క్లెయిం ఏర్పాట్లు
     
    సభ్యుని పాలసీ కింద రిస్కు ప్రారంభం/పునరుద్ధరణ తేది నుంచి 12 నెలలలోపున  బీమా తీసుకున్న సమూహ సభ్యులు ఆత్మహత్య చేసుకుంటే,  మరణించిన వ్యక్తికి మృత్యువు లాభాలు చెల్లించబడవు. అలాంటి సందర్భంలో, మృత్యువు తేది నాటికి చెల్లించిన పూర్తి ప్రీమియం యొక్క 80% (వర్తించే పన్నులు కలుపుకొని) లేదా మృత్యువు తేది నాటికి వర్తించే అప్పగింత విలువ (ఏదైనా ఉంటే), ఏది అధికం అయితే అది, సభ్యుని నామినికి లేదా లాభానికి అర్హులకు తిరిగి చెల్లించడం జరుగుతుంది, అయితే దీని కోసం పాలసీ అమలులో ఉండాలి.

ఎస్‌బిఐ లైఫ్‌ - గ్రామీణ్ సూపర్ సురక్షకి సంబంధించిన రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనల పూర్తి వివరాల కోసం దిగువ పేర్కొన్న  డాక్యుమెంట్లను  శ్రద్ధగా చదవండి.

null
**వయసుకు సంబంధించిన అన్ని సూచికలు చివరి పుట్టిన రోజు నాటివి.
^అన్ని ఎస్‌బిఐ లైఫ్ సమూహ సూక్ష్మ బీమా ఉత్పత్తుల కోసం మొత్తం హామీ సొమ్ము ఒక్కొక్కరికి ` 2,00,000 లైఫ్‌కు (సమూహ సభ్యులు). 

NW/96/ver1/05/22/WEB/TEL


*పన్ను ప్రయోజనా
ఆదాయం పన్ను ప్రయోజనాలు/మినహాయింపులు భారతదేశంలో వర్తించే ఆదాయ పన్ను చట్టాల ప్రకారం ఉంటాయి, ఇవి కాలానుగుణంగా మార్పుకు లోబడి ఉంటాయి.  వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారున్ని సంప్రదించండి.

కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకునేముందు రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం దయచేసి అమ్మకాల బ్రోచర్‌ని శ్రద్ధగా చదవండి.