స్మార్ట్ వుమన్ అడ్వాంటేజ్ | సేవింగ్స్ కమ్ వుమన్ బీమా ప్లాన్ - ఎస్.బి.ఐ లైఫ్
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ ఉమన్ అడ్వాంటేజ్

UIN: 111N106V01

Product Code: 2C

null

స్త్రీలు పుట్టుకతోనే తెలివైనవారు. వారికి తగిన లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్‌ను అందిస్తున్నాము.

  • మహిళలకు ప్రత్యేక ప్లాన్
  • మూడు రకాల ప్రయోజనాలు
  • అంతర్గత ప్రీమియం రద్దు ఎంపిక
  • ద్వంద్వ ప్లాన్ ఎంపికలు
మీరు మహిళ కనుక మీకు దగ్గరైన వారి మరియు బంధువుల పట్ల ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. మీకు మీరే అటువంటి సంరక్షణ మరియు ఆర్థిక భద్రతను కల్పించుకోవాలని ఎప్పుడైనా ఆలోచించారా?
ఎస్‌బిఐ లైఫ్ – స్మార్ట్ ఉమెన్ అడ్వాంటేజ్‌తో ఏకైక, మహిళా ప్రత్యేక ప్లాన్ ద్వారా జీవిత భద్రత, పొదుపులు మరియు తీవ్రమైన ఆరోగ్య సమస్యకుగాను (CI) అందించే ప్రయోజనం వంటి మూడు ప్రయోజనాలను పొందవచ్చు. ఈ మూడు రకాల ప్రయోజనాలతో, మీ రెక్కలను చాచి, ఉన్నత స్థాయిలకు చేరుకోవచ్చు.

ఈ ప్లాన్‌లో పలు ప్రయోజనాలు ఉన్నాయి, వాటిలో –
  • భద్రత –దురదృష్టకరమైన పరిస్థితుల్లో మీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి
  • విశ్వాసం –సమగ్ర భద్రత ద్వారా
  • సౌలభ్యత –రెండు ప్లాన్‌లు మరియు ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ మరియు చైల్డ్ బర్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్‌కు రక్షణగా కవరేజ్‌ల మధ్య ఒకదాన్ని ఎంచుకోవచ్చు

మా దిగువ ప్రయోజనాల ఉదాహరణలో మీ వ్యక్తిగత మరియు పాలసీ సంబంధిత వివరాలను నమోదు చేయండి మరియు మీ మరియు మీ కుటుంబం భవిష్యత్తును సంరక్షించుకోండి.

ప్రపంచాన్ని ఒంటరిగా జయించేందుకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి.

ముఖ్యాంశాలు

null

పార్టిసిపేటింగ్ వ్యక్తిగత సాంప్రదాయక ఎండోమెంట్ ప్లాన్

ఫీచర్‌లు

  • జీవిత బీమా భద్రత
  • అమలులో ఉన్న పాలసీల కోసం తీవ్ర CI సందర్భంలో అంతర్గత ప్రీమియం రద్దు ప్రయోజనం
  • మెచ్యూరిటీనాటికి హమీ మొత్తంతో సహా సాధారణ బోనస్‌లు (ఏవైనా ఉన్నట్లయితే)
  • ద్వంద్వ ప్లాన్ ఎంపికలు* – గోల్డ్ మరియు ప్లాటినమ్
  • డెత్ కవర్ & CI కవర్ యొక్క స్థాయిలను ఎంచుకోండి
  • అడిషనల్ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్ అండ్ కన్‌జెనిటల్ ఎనామలీస్ (APC&CA)

* ప్రత్యేక క్రిటికల్ ఇల్లినెస్ (CI) ఎంచుకున్న ప్లాన్ ఆధారంగా కవర్ చేయబడుతుంది. ప్రారంభంలో ఎంచుకున్న ప్లాన్‌ను పాలసీ వ్యవధిలో మార్చడం సాధ్యం కాదు.

ప్రయోజనాలు

భద్రత

  • మీ కుటుంబం యొక్క ఆర్థిక అవసరాలకు తగిన మొత్తాన్ని సమకూర్చుకోండి
  • మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి ఆర్థిక భద్రత
  • ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ మరియు చైల్డ్ బర్త్ రిలేటెడ్ అబ్‌నార్మాలిటీలకు అదనపు రక్షణ

నమ్మకం

  • సమగ్ర, సంరక్షణ, పొదుపులు మరియు CI వంటి మూడు రకాల ప్రయోజనాలను ఆస్వాదించండి
  • తీవ్ర అనారోగ్యం సంభవించిన సందర్భంలో, తదుపరి ప్రీమియం చెల్లింపుల అవసరం లేకుండా ప్లాన్ ప్రయోజనాలను పొందడం కొనసాగించవచ్చు.

సరళత

  • CI స్థాయి లేదా డెత్ కవర్‌ను మీరే ఎంచుకోవచ్చు
  • రెండు విభిన్న ప్లాన్‌ల్లో ఒకదానిని ఎంచుకనే సదుపాయం – గోల్డ్ మరియు ప్లాటినమ్ – మహిళా సంబంధిత CI ఎంచుకోవడం కోసం లేదా మహిళా సంబంధిత మరియు ఇతర కవరేజ్ CI కోసం

పన్ను ప్రయోజనాలను పొందండి~

మెచ్యూరిటీ లబ్ధి (అమలులో ఉన్న పాలసీలకు):

మెచ్యూరిటీనాటికి లైఫ్ ఇన్స్యూరెన్స్ తీసుకున్న వ్యక్తి జీవించి ఉన్నట్లయితే, ప్రాథమిక హామీ మొత్తం* + స్థిరమైన సాధారణ రివర్షనరీ బోనస్‌లు + టెర్మినల్ బోనస్ (ఏవైనా) చెల్లించబడతాయి.
* ఇక్కడ, ప్రాథమిక హామీ మొత్తం అనేది మెచ్యూరిటీ నాటికి గ్యారెంటీ ఇచ్చిన హామీ మొత్తానికి సమానం.

మరణానంతర లబ్ధి (అమలులో ఉన్న పాలసీలకు):

లైఫ్ ఇన్స్యూరెన్స్ చేయించుకున్న వ్యక్తి మరణించిన పక్షంలో, స్థిరమైన సాధారణ రివర్షనరీ బోనస్‌లు ప్లస్ టెర్మినల్ బోనస్‌తోపాటు (ఏవైనా) ‘మరణిస్తే ఇచ్చే హామీ మొత్తం’ లేదా చెల్లించిన ప్రీమియానికి 105% ఏదీ ఎక్కువైతే ఆ మొత్తాన్ని లబ్దిదారునికి చెల్లించబడుతుంది. ఇక్కడ, కింది సందర్భాల్లో మరణించిన సమయానికి హామీ మొత్తం ఎక్కువగా ఉంటుంది:

  • వార్షిక ప్రీమియానికి 10 రెట్లు,
  • మెచ్యూరిటీ నాటికి గ్యారెంటీ ఇచ్చిన హామీ మొత్తం,
  • మరణించినప్పుడు హామీ ఇచ్చిన పూర్తి మొత్తం చెల్లించబడుతుంది, ఇది SAMF x మెచ్యూరిటీనాటికి ప్రాథమిక హామీ మొత్తం.

మరణించినప్పుడు చెల్లించే మొత్తంలో పాలసీ ముగుస్తుంది.

తీవ్ర అనారోగ్య ప్రయోజనం (అమలులో ఉన్న పాలసీల కోసం):

అనారోగ్య తీవ్రత ఆధారంగా చెల్లించబడుతుంది:-

  • CI స్వల్ప అనారోగ్య స్థాయిలో, CI హామీ మొత్తంలో 25% మొత్తం చెల్లించబడుతుంది.
  • తీవ్ర అనారోగ్య స్థాయిలో, CI హామీ మొత్తంలో పాలసీ కోసం గతంలో చెల్లించిన మొత్తాన్ని మినహాయించి 100% మొత్తం చెల్లించబడుతుంది.
  • ప్రమాదకర సిఐ స్థాయిలో, CI హామీ మొత్తంలో పాలసీ కోసం గతంలో చెల్లించిన మొత్తాన్ని మినహాయించి 150% మొత్తం చెల్లించబడుతుంది.

ఇక్కడ CI హామీ మొత్తం = SAMF x మెచ్యూరిటీనాటికి గ్యారెంటీ ఇచ్చిన హామీ మొత్తం.
మరణించినప్పుడు CI హామీ మొత్తం మరియు పూర్తి హామీ మొత్తం సమానం.

అంతర్నిర్మిత-లబ్ధి:

  • ప్రీమియం రద్దు ప్రయోజనం (అమలులో ఉన్న పాలసీల కోసం): తీవ్ర స్థాయి CI కింద ఒక క్లెయిమ్‌ను సంస్థ ఆమోదించినప్పుడు, పాలసీ కోసం ఏవైనా ఉన్నట్లయితే APC&CA ఎంపిక ప్రీమియంతోసహా అన్ని భావి ప్రీమియంలు వైద్య పరిస్థితి నిర్ధారించబడిన తేదీ నుండి మిగిలిన పాలసీ వ్యవధి కోసం రద్దు చేయబడతాయి. మిగిలిన పాలసీ ప్రయోజనాలు పాలసీ వ్యవధి ముగిసే వరకు కొనసాగుతాయి.
  • అడిషనల్ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్ అండ్ కన్‌జెనిటల్ ఎనామలీస్ (APC&CA) ఎంపిక: హామీ మొత్తం కోసం ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ మరియు చైల్డ్ బర్త్ రిలేటెడ్ అబ్‌నార్మాలిటీలకు అందించే కవర్ అనేది బేసిక్ హామీ మొత్తం యొక్క 20%కు ఫిక్స్ చేయబడుతుంది. ఈ ప్రయోజనం ఎంపిక వ్యవధిలో లేదా 45 సంవత్సరాల వయస్సు వరకు ఏది ముందు వస్తే, ఒకసారి మాత్రమే చెల్లిస్తారు. ఈ ఎంపిక కోసం ప్రీమియం చెల్లింపు కూడా ముగించబడుతుంది.

~పన్ను ప్రయోజనాలు:

  • మీకు వర్తించదగిన ఆదాయ పన్ను చట్టాల ప్రకారం ఆదాయ పన్ను ప్రయోజనాలు/ మినహాయింపులకు అర్హత ఉంది, ఇవి కాలానుగుణంగా జరిగే మార్పుకు లోబడి ఉంటాయి. మీరు తదుపరి వివరాల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు:
    http://www.sbilife.co.in/sbilife/content/21_3672#5. దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారుని సంప్రదించండి.

తీవ్ర అనారోగ్య (CI) భద్రత మరియు APC & CA ఎంపిక యొక్క భద్రత, వివరణలు, వేచి ఉండాల్సిన వ్యవధి, మినహాయింపులు మొదలైన వాటి గురించి వివరాలు కోసం, దయచేసి సేల్స్ బ్రౌచర్ చూడండి.
ప్రమాద అంశాలు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి కొనుగోలుని నిర్ధారించే ముందు విక్రయాల కరపత్రాన్ని క్షుణ్ణంగా చదవండి.
ఎస్‌బిఐ లైఫ్ – స్మార్ట్ ఉమెన్ అడ్వాంటేజ్ యొక్క ప్రమాద కారకాలు, నిబంధనలు మరియు షరతులు గురించి మరిన్ని వివరాలు కోసం, కింది పత్రాలను చదవండి
null
**వయసుకు సంబంధించిన అన్ని సూచనలు చివరి పుట్టినరోజు నాటికి వయస్సుగా ఉంటాయి.
#నెలవారీ మోడ్ కోసం, ముందుగా 3 నెలల ప్రీమియం చెల్లించాలి మరియు పునరుద్ధరణ ప్రీమియం చెల్లింపు ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సిస్టమ్ (ECS) లేదా స్టాండింగ్ సూచనల (చెల్లింపు బ్యాంక్ ఖాతా నుండి డైరెక్ట్ డెబిట్ ద్వారా లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించాలి) నెలవారీ వేతన పొదుపు పథకం (SSS) కోసం, ముందుగా 2 నెలల ప్రీమియం చెల్లించాలి మరియు పునరుద్ధరణ ప్రీమియం చెల్లింపు వేతనంలో కోత ద్వారా అనుమతించబడుతుంది
^ APC&CA ఎంపికను ఎంచుకున్న సందర్భంలో, పాలసీ వ్యవధి మెచ్యూరిటీనాటికి గరిష్ట వయస్సు ఎంపికను ఉల్లంఘించకుండా తగిన రీతిలో ఎంచుకోవాలి.

2C.ver.03-10/17 WEB TEL

**రాబడులు @4% మరియు @8% ప్ర.సం. విధంగా ఊహించిన ధరలు, వర్తించిన అన్ని ఛార్జీలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ ధరల వద్ద ఉదాహరణ సూచికలు మాత్రమే. బోనస్ జమా వ్యవధిలో బోనస్ ధరలను స్థిరంగా ఊహించడం జరిగింది, కంపెనీ పెట్టుబడి అనుభవం పైన ఆధారపడి, వాస్తవానికి అసలైన బోనస్‌లో మార్పు ఉండవచ్చు. (వీటికి హామీ ఉండదు మరియు ఇవి రాబడులకు ఎగువ లేదా దిగువ పరిమితులు కావు). రాబడులు అనేవి భవిష్యత్తు పెట్టుబడుల కార్యాచరణతో పాటు ఎన్నో అంశాల పైన ఆధారపడి ఉంటాయి.

ఇందులో ఉండే రిస్కులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి కొనుగోలును నిర్ధారించడానికి ముందు విక్రయ కరపత్రాన్ని క్షుణ్ణంగా చదవండి.

*పన్ను ప్రయోజనా
పన్ను ప్రయోజనాలు ఆదాయపు పన్ను చట్టాలకు అనుగుణంగా ఉంటాయి &సమయానుగుణంగా మారతాయి. దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారును సంప్రదించండి
ప్లాన్ ప్రయోజనాల విభాగం క్రింద ప్రతి ఉత్పత్తి పేజీలో మరొక పన్ను నిరాకరణ ఉంటుంది. భారతదేశంలో వర్తించే ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం పన్ను ప్రయోజనాలు/మినహాయింపులు ఉంటాయి. తదుపరి వివరాల కోసం, మీరు మా వెబ్సైట్ను సందర్శించవచ్చు దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారును సంప్రదించండి.