SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

ఎస్‌బిఐ లైప్ - ఫ్లెక్సీ స్మార్ట్ ఫ్లస్

UIN: 111N093V01

Product Code: 1M

null

సౌభాగ్యం మరియు భధ్రత హామీ ఇవ్వబడతాయి.

  • రెండు ప్లాన్ ఎంపికలు
  • నగదు సేకరణ
  • పాక్షిక విత్‌డ్రాలు
  • సమ్ ఎస్యూరెడ్ మరియు పాలసీ వ్యవధిని మార్చుకునే ఎంపిక
ఈ ప్లాన్ ఒప్పందంలో మొదటి అయిదు ఏళ్ల పాటు ఎలాంటి నగదు అందించబడదు. పాలసీదారు ఈ ప్లాన్‌లో పెట్టుబడిగా పెట్టిన డబ్బును 5వ పాలసీ సంవత్సరం ముగిసే వరకు పూర్తిగా లేదా పాక్షికంగా తీసుకోలేరు.

జీవన మార్పులకు అనుకూలంగా సౌలభ్యతను కలిగి ఉండే లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ మీరు కలిగి ఉన్నారా?


ఎస్‌బిఐ లైఫ్ – ఫ్లెక్సీ స్మార్ట్ ప్లస్ మీ మారుతున్న అవసరాలకు అనుకూలంగా మీ ఇన్స్యూరెన్స్ ప్లాన్ సవరించడానికి అనుమతిస్తుంది. మీ సేవింగ్స్ పెరగడానికి ఇది క్రమబద్ధమైన బోనస్ వడ్డీని కూడా అందిస్తుంది.

ఈ ప్లాన్ వీటిని అందిస్తుంది -
  • భద్రత – మీ కుటుంబం యొక్క ఆర్థిక పటిష్టతను నిర్థారిస్తుంది
  • విశ్వాసం – అమలులో ఉన్న పాలసీల కోసం ఖచ్చితమైన కనీస బోనస్ వడ్డీ రేట్.
  • సౌలభ్యత – మీ పాలసీ వ్యవధిని మరియు హామీ మొత్తాన్ని మీ అవసరాలకు అనుకూలంగా సర్దుబాటు చేసుకోవచ్చు
  • లిక్విడిటీ –6వ పాలసీ సంవత్సరం నుండి మీ వ్యయాలకు తగిన మొత్తాన్ని పాక్షిక విత్‌డ్రాల ద్వారా పొందవచ్చు

దిగువ మా ప్రయోజనాల ఉదాహరణను ప్రయత్నించి, ఆర్థికంగా మీ భవిష్యత్తును ఏ విధంగా సురక్షితం చేసుకోవచ్చో చూడండి.

ముఖ్యాంశాలు

null

వ్యక్తిగత, పార్టిసిపేటింగ్, వేరియబుల్ ఇన్స్యూరెన్స్ ఉత్పత్తి

ఫీచర్‌లు

  • రెండు ప్లాన్ ఎంపికల నుండి ఎంచుకోండి
  • అమలులో ఉన్న పాలసీల కోసం వాటి వ్యవధి మొత్తం ఖచ్చితంగా కనీసం సంవత్సరానికి 1.00% బోనస్ వడ్డీ రేటు ఇవ్వబడుతుంది
  • మీ సమ్ ఎస్యూరెడ్ సవరించండి మరియు మీ పాలసీ వ్యవధిని పొడిగించండి
  • 6వ పాలసీ సంవత్సరం నుండి పాక్షిక విత్‌డ్రాలను పొందండి

ప్రయోజనాలు

భద్రత

  • రెండు ప్లాన్ ఎంపికలు – గోల్డ్ మరియు ప్లాటినమ్, ఇవి మీ కుటుంబం యొక్క ఆర్థిక అవసరాలకు తగినట్లు లైఫ్ కవర్‌ను అందిస్తాయి

నమ్మకం

  • సంవత్సరాలపాటు మీ నగదు నిల్వ చేసుకుని, మీ ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకోండి

సరళత

  • మీ మారుతున్న అవసరాల ప్రకారం సమ్ ఎస్యూరెడ్ పెంచుకోండి లేదా తగ్గించుకోండి
  • మీ ఎంచుకున్న పాలసీ వ్యవధిని పెంచుకునే ఎంపికతో మీ నిల్వను రెట్టింపు చేసుకోండి

లిక్విడిటీ

  • ఊహించని వ్యయాలకు నగదు కోసం 6వ పాలసీ సంవత్సరం నుండి పాక్షిక విత్‌డ్రాలు అనుమతించబడతాయి

పన్ను ప్రయోజనాలను పొందండి*

మరణించినప్పుడు

దురదృష్టవశాత్తూ, జీవిత బీమా పొందిన వ్యక్తి మరణించినప్పుడు, లబ్ధిదారు క్రింది ప్రయోజనాన్ని పొందుతారు:

గోల్డ్ ఎంపిక కోసం: వర్తించేటటువంటి పాలసీ ఖాతా విలువ$ లేదా హామీ మొత్తం^ / చెల్లించిన హామీ మొత్తంలో^ అధిక విలువ లేదా మరణానంతర క్లెయిమ్ గురించి సమాచారం అందించే తేదీ నాటికి చెల్లించిన మొత్తం ప్రీమియాల్లో 105%.

^మరణించే నాటికి 60 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉంటే చివరి 2 ఏళ్లలో చేసిన పాక్షిక ఉపసంహరణల స్థాయికి, అలాగే మరణించే నాటికి 60 ఏళ్లు & అంతకంటే ఎక్కువ వయస్సు ఉంటే, 58 ఏళ్ల నుండి చేసిన అన్ని పాక్షిక ఉపసంహరణల స్థాయికి హామీ మొత్తం తగ్గించబడుతుంది.

ప్లాటినం ఎంపిక కోసం: వర్తించేటటువంటి పాలసీ ఖాతా విలువ మరియు హామీ మొత్తం / చెల్లించిన హామీ మొత్తంలో అధిక విలువ లేదా మరణానంతర క్లెయిమ్ గురించి సమాచారం అందించే తేదీ నాటికి చెల్లించిన మొత్తం ప్రీమియాల్లో 105%.

జీవించి ఉన్నట్లయితే

మెచ్యూరిటీ ప్రయోజనం: పాలసీ మెచ్యూర్ అయినప్పుడు, టెర్మినల్ బోనస్ వడ్డీ రేటు ఏదైనా ఉంటే దానితో సహా పాలసీ ఖాతా విలువను పొందే హక్కు పాలసీదారుకి అందించబడుతుంది, ఇది మెచ్యూరిటీ తేదీన గణించబడుతుంది మరియు మెచ్యూరిటీ తేదీన ఏకమొత్తంగా అందించబడుతుంది.

$పాలసీ ఖాతా విలువ

పాలసీ ఖాతా మీకు చెందిన ఫండ్ విలువను సూచిస్తుంది. పాలసీ ఖాతాలో చెల్లించిన ప్రీమియాలు, పాలసీ క్రింద వర్తించే మొత్తం ప్రీమియం కేటాయింపు ఛార్జీ మినహాయించి క్రెడిట్ చేయబడతాయి, అలాగే దిగువ పేర్కొన్నట్లుగా చేర్పులు క్రెడిట్ చేయబడతాయి. మిగతా అన్ని ఛార్జీలు పాలసీ ఖాతా విలువ నుండి తగ్గించబడతాయి. అలాగే మీరు చేసిన అన్ని ఉపసంహరణలు, మీకు చేసిన చెల్లింపులు మొదలైనవి మీ పాలసీ ఖాతా నుండి తగ్గించుకోబడతాయి.

పాలసీ ఖాతాకు వర్తించే వివిధ స్థాయి చేర్పులు దిగువ పేర్కొనబడ్డాయి -

  • అమలులో ఉన్న పాలసీల కోసం మొత్తం వ్యవధిలో ఉత్పత్తి యొక్క ఖచ్చితమైన కనీస బోనస్ వడ్డీ రేటు సంవత్సరానికి 1.00%ఇవ్వబడుతుంది
  • ఎగువ పేర్కొన్న దానితో పాటు, ఆస్తులు మరియు అప్పుల చట్టబద్ధమైన విలువ నిర్ధారణ తర్వాత మిగులు సొమ్ము ఆధారంగా ప్రతి ఆర్థిక సంవత్సరం చివరిలో సున్నాయేతర రుణాత్మక క్రమబద్ధ బోనస్ వడ్డీ రేటు ప్రకటించబడుతుంది.
  • మధ్యంతర బోనస్ వడ్డీ రేటు ప్రతి ఆర్థిక సంవత్సరం మొదట్లో ప్రకటించబడుతుంది, ఆ ఆర్థిక సంవత్సరంలో నిష్క్రమించబడే పాలసీలకు ఇది వర్తిస్తుంది. సంవత్సరం చివరిలో ప్రకటించే క్రమబద్ధ బోనస్ వడ్డీ రేటు మధ్యంతర బోనస్ వడ్డీ రేటు కంటే తక్కువ ఉండకూడదు.
  • పాలసీ నుండి నిష్క్రమించే సమయంలో (మెచ్యూరిటీ/మరణం/సరెండర్), టెర్మినల్ బోనస్ వడ్డీ రేటు చెల్లించబడవచ్చు.

*పన్ను ప్రయోజనాలు

మీకు వర్తించదగిన ఆదాయ పన్ను చట్టాల ప్రకారం ఆదాయ పన్ను ప్రయోజనాలు/ మినహాయింపులకు అర్హత ఉంది, ఇవి కాలానుగుణంగా జరిగే మార్పుకు లోబడి ఉంటాయి. మీరు మరిన్ని వివరాలు కోసం మా వెబ్‌సైట్‌ను ఇక్కడ సందర్శించవచ్చు: http://www.sbilife.co.in/sbilife/content/21_3672#5. దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారును సంప్రదించండి.

ఎస్‌బిఐ లైఫ్ – ఫ్లెక్సీ స్మార్ట్ ప్లస్ యొక్క ప్రమాద కారకాలు, నిబంధనలు మరియు షరతులు గురించి మరిన్ని వివరాలు కోసం, కింది పత్రాలను చదవండి.
null
^ వయస్సుకి సంబంధించిన ఈ సూచనలన్నీ గత పుట్టినరోజు ఆధారంగా అందించబడ్డాయి.
## నెలవారీ మోడ్‌లో, ముందుగా 3 నెలల ప్రీమియాన్ని చెల్లించాలి మరియు ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ (ECS), క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ మరియు SI - EFT ద్వారా మాత్రమే పునరుద్ధరణ ప్రీమియం చెల్లింపు అనుమతించబడుతుంది.

1M.ver.04-10/17 WEB TEL

**రాబడులు @4% మరియు @8% ప్ర.సం. విధంగా ఊహించిన ధరలు, వర్తించిన అన్ని ఛార్జీలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ ధరల వద్ద ఉదాహరణ సూచికలు మాత్రమే. బోనస్ జమా వ్యవధిలో బోనస్ ధరలను స్థిరంగా ఊహించడం జరిగింది, కంపెనీ పెట్టుబడి అనుభవం పైన ఆధారపడి, వాస్తవానికి అసలైన బోనస్‌లో మార్పు ఉండవచ్చు. (వీటికి హామీ ఉండదు మరియు ఇవి రాబడులకు ఎగువ లేదా దిగువ పరిమితులు కావు). రాబడులు అనేవి భవిష్యత్తు పెట్టుబడుల కార్యాచరణతో పాటు ఎన్నో అంశాల పైన ఆధారపడి ఉంటాయి.

ఇందులో ఉండే రిస్కులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి కొనుగోలును నిర్ధారించడానికి ముందు విక్రయ కరపత్రాన్ని క్షుణ్ణంగా చదవండి.

*పన్ను ప్రయోజనా
పన్ను ప్రయోజనాలు ఆదాయపు పన్ను చట్టాలకు అనుగుణంగా ఉంటాయి &సమయానుగుణంగా మారతాయి. దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారును సంప్రదించండి
ప్లాన్ ప్రయోజనాల విభాగం క్రింద ప్రతి ఉత్పత్తి పేజీలో మరొక పన్ను నిరాకరణ ఉంటుంది. భారతదేశంలో వర్తించే ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం పన్ను ప్రయోజనాలు/మినహాయింపులు ఉంటాయి. తదుపరి వివరాల కోసం, మీరు మా వెబ్సైట్ను సందర్శించవచ్చు దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారును సంప్రదించండి.