SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

ఎస్‌బిఐ లైఫ్ - సిఎస్‌సి సరళ్ సంచయ్

UIN: 111N099V01

Product Code: 1T

null

చిన్న పెట్టుబడులతో, ఆనందంతోపాటు సంరక్షణను కూడా పొందండి.

  • • జీవిత భద్రతతో కూడిన పొదుపులు
  • త్రైమాసిక వడ్డీ పొందవచ్చు
  • పాక్షిక విత్‌డ్రాల సౌకర్యం
వ్యక్తిగత, నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, వేరియబుల్ ఇన్స్యూరెన్స్ ఉత్పత్తి

ఈ ప్లాన్ ఒప్పందంలో మొదటి అయిదు ఏళ్ల పాటు ఎలాంటి నగదు అందించబడదు. పాలసీదారు ఈ ప్లాన్‌లో పెట్టుబడిగా పెట్టిన డబ్బును 5వ పాలసీ సంవత్సరం ముగిసే వరకు పూర్తిగా లేదా పాక్షికంగా తీసుకోలేరు.

మీరు తక్కువ వ్యయంతో సంరక్షణను మరియు వ్యవధి ముగింపులో ఖచ్చితమైన ప్రయోజనాలను పొందాలనుకుంటున్నారా?


ఎస్‌బిఐ లైఫ్ – సిఎస్‌సి సరళ్ సంచయ్‌తో సేవింగ్స్ మరియు బీమా భద్రత ప్రయోజనాలను పొందండి.

ఈ ప్లాన్ వీటికి అందిస్తుంది –
  • భద్రత –ఊహించని సందర్భంలో మీ కుటుంబ ఆర్థిక వ్యవస్థకు సంరక్షణ అందిస్తుంది
  • నమ్మకం – మీ పాలసీ ఖాతాకు త్రైమాసిక వడ్డీ జోడింబడుతుంది
  • సౌలభ్యత – మీ పాలసీ ఖాతాను టాప్-అప్ చేసుకోవడానికి
  • సరళత –తక్షణమే ఇన్స్యూరెన్స్ ఇవ్వబడుతుంది
  • లిక్విడిటీ – 6వ పాలసీ సంవత్సరం నుండి పాక్షిక విత్‌డ్రాలు

చిన్న చిన్న పెట్టుబడుల వలన మీరు ఆనందంగా గడపడానికి నగదు నిల్వ ఏర్పడుతుంది.

ముఖ్యాంశాలు

null

సేవింగ్స్ ప్లాన్, ఎస్‌బిఐ లైఫ్ – సిఎస్‌సి సరళ్ సంచయ్, వేరియబుల్ ఇన్స్యూరెన్స్ ప్లాన్, కామన్ సర్వీస్ సెంటర్

ఫీచర్‌లు
 
  • సేవింగ్స్ ప్లాన్‌తో ఒక ఇన్స్యూరెన్స్
  • త్రైమాసిక వడ్డీ జోడింపులు పాలసీ వ్యవధి మొత్తం లభిస్తాయి
  • టాప్-అప్ సదుపాయం
  • ఆధార్ ఆధారిత పాలసీ దరఖాస్తు విధానం
  • పాక్షిక విత్‌డ్రా సౌకర్యం 6వ పాలసీ సంవత్సరం
ప్రయోజనాలు
భద్రత
  • మీ కుటుంబ భవిష్యత్తును సంరక్షించడం మరియు మీ సేవింగ్స్‌ను కొనసాగించడం వంటి రెండు ప్రయోజనాలను ఒకే ప్లాన్‌తో ఆనందించండి
నమ్మకం
  • మీ డబ్బును పెంచుకోవడానికి పాలసీ వ్యవధి మొత్తంలో సంవత్సరానికి కనీసం 1% ఫ్లోర్ రేట్ ఉంటుంది
సరళత
  • మీ నగదు నిల్వను పెంచుకోవడానికి ఒకే పాలసీలో అదనపు నిధులను పెట్టుబడి పెట్టడానికి ఎంచుకోవచ్చు
  • మీ సౌకర్యానికి తగినట్లు ప్రీమియం చెల్లింపు ఫ్రీక్వెన్సీని ఎంచుకోండి
సరళత్వం
  • మీ ఆధార్ సంఖ్యతో ఆన్‌లైన్ దరఖాస్తు సులభంగా దాఖలు చేయవచ్చు
  • మీ పాలసీను తక్షణమే పొందడానికి ఏదైనా సిఎస్‌సిను సందర్శించండి
లిక్విడిటీ
  • మీ నగదు అవసరాలు కోసం 6వ పాలసీ సంవత్సరం నుండే పాక్షిక విత్‌డ్రాలను చేసుకోవచ్చు
పన్ను ప్రయోజనాలను* పొందండి
మరణానంతర ప్రయోజనం
పాలసీ వ్యవధిలో జీవిత బీమా పొందిన వ్యక్తి మరణిస్తే, పాలసీ అమలులో ఉన్నట్లయితే మేము దిగువ వివరించినట్లుగా ఎ, బి, సి మరియు డి మొత్తాల్లో అత్యధిక మొత్తాన్ని చెల్లిస్తాము:
  • హామీ మొత్తం
  • మరణించే తేదీ వరకు చెల్లించిన టాప్-అప్ ప్రీమియాలతో పాటు చెల్లించిన మొత్తం ప్రీమియాల్లో 105%.
  • సంవత్సరానికి 1.00% చొప్పున చక్రవడ్డీతో మరణించే తేదీ వరకు చెల్లించిన టాప్-అప్ ప్రీమియాలతో పాటు చెల్లించిన మొత్తం ప్రీమియాలు.
  • మీ వ్యక్తిగత పాలసీ ఖాతాలోని నగదు మిగులు (IPA)
మెచ్యూరిటీ ప్రయోజనం
పాలసీ వ్యవధి ముగిసే వరకు జీవిత బీమా పొందిన వ్యక్తి జీవించి ఉంటే, మేము క్రింది సందర్భాల్లో ఎ లేదా బిలో అత్యధిక మొత్తాన్ని చెల్లిస్తాము,
  • సంవత్సరానికి 1.00% చొప్పున చక్రవడ్డీతో పాలసీ మెచ్యూర్ అయ్యే తేదీ వరకు చెల్లించిన టాప్-అప్ ప్రీమియాలతో పాటు చెల్లించిన మొత్తం ప్రీమియాల నుండి పాక్షిక ఉపసంహరణలు ఏవైనా చేసి ఉంటే దాన్ని తీసివేయగా వచ్చిన మొత్తం.
  • మెచ్యూరిటీ తేదీన మీ IPAలో ఉన్న బ్యాలెన్స్.

  • వ్యవధి ముగింపులో మీ పాలసీ అమలులో ఉన్న పక్షంలో మాత్రమే ఎగువ పేర్కొన్నట్లుగా లబ్ధి చెల్లించబడుతుంది.
    గమనిక: మరణానంతర లేదా మెచ్యూరిటీ లబ్ధి చెల్లించే పక్షంలో, IPAలో ఉన్న బ్యాలెన్స్‌లో త్రైమాసికంలో మిగిలిన భాగానికి ముందుగానే క్రెడిట్ చేసిన వడ్డీ తగ్గించబడుతుంది.
*పన్ను ప్రయోజనాలు
  • ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80సి క్రింద చెల్లించిన ప్రీమియంలో పన్ను తగ్గింపు ఉంటుంది. అయితే, ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన ప్రీమియం వాస్తవ మూలధన హామీ మొత్తంలో 10% కంటే మించితే, పన్ను ప్రయోజనం గరిష్టంగా హామీ మొత్తంలో 10%కి పరిమితం చేయబడుతుంది.
  • ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80సి క్రింద పాలసీ వ్యవధిలోని ఏ సంవత్సరంలోనూ చెల్లించాల్సిన ప్రీమియం వాస్తవ మూలధన హామీ మొత్తంలో 10% కంటే మించకపోతే చెల్లించిన ప్రీమియంలో పన్ను మినహాయింపు ఉంటుంది.
  • పన్ను ప్రయోజనాలు ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం అందించబడతాయి & సమయానుగుణంగా మారతాయి. దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారుని సంప్రదించండి.

ప్రమాద అంశాలు, నిబంధనలు మరియు షరతులపై మరిన్ని వివరాల కోసం, దయచేసి కొనుగోలుని నిర్ధారించే ముందు విక్రయాల కరపత్రాన్ని క్షుణ్ణంగా చదవండి.
ఎస్‌బిఐ లైఫ్ – సిఎస్‌సి సరళ్ సంచయ్ యొక్క ప్రమాద కారకాలు, నిబంధనలు మరియు షరతుల గురించి మరింత సమాచారం కోసం, దయచేసి దిగువ పత్రాలను జాగ్రత్తగా చదవండి.
null
* వయసుకు సంబంధించి అన్ని సూచనలు చివరి పుట్టినరోజు నాటికి వయస్సుగా ఉంటాయి.

1T.ver.02-06/17 WEB TEL

ఇందులో ఉండే రిస్కులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి కొనుగోలును నిర్ధారించడానికి ముందు విక్రయ కరపత్రాన్ని క్షుణ్ణంగా చదవండి.

*పన్ను ప్రయోజనా
పన్ను ప్రయోజనాలు ఆదాయపు పన్ను చట్టాలకు అనుగుణంగా ఉంటాయి &సమయానుగుణంగా మారతాయి. దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారును సంప్రదించండి
ప్లాన్ ప్రయోజనాల విభాగం క్రింద ప్రతి ఉత్పత్తి పేజీలో మరొక పన్ను నిరాకరణ ఉంటుంది. భారతదేశంలో వర్తించే ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం పన్ను ప్రయోజనాలు/మినహాయింపులు ఉంటాయి. తదుపరి వివరాల కోసం, మీరు మా వెబ్సైట్ను సందర్శించవచ్చు దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారును సంప్రదించండి.