సూక్ష్మ బీమా ప్లాన్ - ఎస్‌బిఐ లైఫ్ శక్తి | 50% రాబడి రేటు
SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

ఎస్‌బిఐ లైఫ్ -శక్తి

UIN: 111N038V03

ఉత్పత్తి కోడ్: 095

null

మేచ్యురిటితో 50% ప్రీమియం తిరిగిపొందే సామూహిక సూక్ష్మ వ్యవధి బీమా ఉత్పత్తి.

  • అందుబాటైన బీమా భద్రత
  • సౌకర్యవంతమైన భద్రత మొత్తం
  • మెచ్యురిటి నాడు ప్రీమియం తిరిగిపొందడం
మెచ్యురిటి నాడు 50% ప్రీమియం తిరిగిపొందే అనుసంధాన-రహితమైన, పాల్గొను-రహితమైన సామూహిక వ్యవధి బీమా ఉత్పత్తి.

మీరు సూక్ష్మ ఆర్థిక సంస్థలు (ఎమ్‌ఎఫ్‌ఐ) లేదా ప్రభుత్వ-రహితమైన సంస్థలు (ఎన్‌జిఓ)లు గా కొనసాగుతు మీ సభ్యుల జీవితాలకు భద్రత కలిగించేందుకు అందుబాటైన ప్లాన్స్ కోసం చూస్తున్నారా?

ఎస్‌బిఐ లైఫ్-శక్తి మీ సభ్యులకు భద్రత కలిగించేందుకు ప్రత్యేకంగా రూపొందించబడింది. దీనితో పాటు చెల్లించిన ప్రీమియం యొక్క 50% తిరిగి పొందుతారు.

ఎస్‌బిఐ లైఫ్ -శక్తి ప్లాన్ అందిస్తోంది -
  • భద్రత – మరణం సంభవించిన సందర్భంలో మీ సభ్యులకు రక్షణ కల్పిస్తుంది మరియు వారి కుటుంబాలకు భద్రత కల్పిస్తుంది
  • విశ్వసనీయత - మెచ్యురిటినాడు చెల్లించిన ప్రీమియం యొక్క 50% తిరిగి పొందడం.
  • సౌకర్యవంతం - మీ సభ్యుల అవసరాల ప్రకారం బీమా రాశిని ఎంచుకోవచ్చు.
  • చౌకైనది – సముచిత ప్రీమియంలతో.

ముఖ్యాంశాలు

null

అననుబంధ, భాగస్వామ్యం లేని గ్రూప్ మైక్రో ఇన్సూరెన్స్ ఉత్పత్తి

ఫీచర్‌లు

  • సమూహంకు జీవిత భద్రత అందించడం
  • మెచ్యురిటినాడు చెల్లించిన ప్రీమియం యొక్క 50% తిరిగి ఇవ్వడం
  • సభ్యుల అవసరాల ప్రకారం బీమా రాశి, రూ. 2,00,000 వరకు భద్రత
  • చౌకైన ప్రీమియం మొత్తాల శ్రేణి

ప్రయోజనాలు

భద్రత
  • • ఏదైనా అనూహ్య సంఘటన తలెత్తుతే సమూహ సభ్యులకు భద్రత కలిగించి మరియు వారి కుటుంబీయులకు అండగా ఉంటుంది
విశ్వసనీయత
  • మేచ్యురిటి నాడు సభ్యులు చెల్లించిన ప్రీమియం యొక్క 50% తిరిగి పొందే హామీపూరిత లాభం
సౌకర్యం
  • మీకు సమూహ సభ్యులకు వారి ఆర్థిక అవసరాల ప్రకారం భద్రత కలిగిస్తుంది
అందుబాటు
  • సరసమైన ధరకే మీ సమూహ సభ్యులకు బీమా లాభాలను అందిస్తుంది/li>
మరణానంతర లబ్ధి:
పాలసీ వ్యవధి కొనసాగుతున్నప్పుడు జీవిత బీమా తీసుకున్నవారు మరణిస్తే, ఎంచుకున్న బీమా రాశిని చెల్లించడం జరుగుతుంది.
మేచ్యురిటి లాభం:
పాలసీ వ్యవధి ముగింపు వరకు జీవిత బీమా తీసుకున్నవారు బతికివుంటే, చెల్లించిన పూర్తి ప్రీమియం ( వర్తించే పన్నులు మినహాయించి) యొక్క 50% తిరిగి ఇవ్వడం జరుగుతుంది
ఇతర సమాచారం
  • సరెండర్
    సభ్యులు అమలులోవున్న మరియు చెల్లించబడిన పాలసీని ఎప్పుడైనా సరే మొదటి పాలసీ సంవత్సరం తర్వాత మరియు మేచ్యురిటి తేదికి ముందు విరమించుకోవచ్చు, అయితే సరెండర్ విలువ కోసం పూర్తి 2 సంవత్సరాల ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది.
  • గ్రేస్ వ్యవధి
    ప్రీమియం చెల్లించవలసిన గడువు తేది నుంచి 30 రోజుల గ్రేస్ వ్యవధిని అనుమతించబడుతుంది.
  • పెయిడప్ విలువ
    గ్రేస్ వ్యవధిలోపల బీమా తీసుకున్న సభ్యులు ప్రీమియం చెల్లించకపోతే, అప్పుడు కూడా అతనికి/ఆమెకు భద్రత ఉంటుంది కాని తగ్గించబడిన మృత్యువు/మేచ్యురిటి లాభంతో. మొదటి రెండు సంవత్సరాల ప్రీమియమ్స్ చెల్లిస్తే మాత్రమే బీమా భద్రతకు చెల్లించబడే విలువ దక్కుతుంది.
  • పునరుద్ధరణ:
    చెల్లించవలసిన మొదటి ప్రీమియం చెల్లించని గడువు ముగింపు తేది నుంచి 2 సంవత్సరాల వ్యవధిలో సభ్యుడు లేదా మాస్టర్ పాలసీదారు, సభ్యుని జీవిత బీమా భద్రతను పునరుద్ధరించుకునేందుకు ఎంచుకోవచ్చు.
  • ఉచితంగా పరిశీలన వ్యవధి
    ఒకవేళ ఇది తప్పనిసరి స్కీము (పాల్గొనే నిర్ణయం సభ్యుని చేతిలో లేక మరియు సభ్యులు స్కీములో చేరడం తప్పనిసరి అయితే) అయితే, ఉచితంగా-పరిశీలన వ్యవధిలో రద్దు చేసుకునే ఎంపిక బీమా చేసుకున్న సభ్యునికి ఉండదు మరియు మాస్టర్ పాలసీదారుకు మాత్రమే ఉంటుంది.
    • ఒకవేళ ఇది స్వేచ్ఛ పూరితమైనా స్కీము అయితే (పాల్గొనే నిర్ణయం సభ్యునికి ఉండి మరియు స్కీములో చేరాలని నిర్ణయిస్తే), నేరుగా మార్కెట్ నుంచి కాకుండా ఇతర మాధ్యమాల ద్వారా పొందిన పాలసీల విషయంలో సర్టిఫికెట్ ఆఫ్ ఇన్సూరెన్స్ పొందిన తేది నుంచి 15 రోజుల లోపున మరియు నేరుగా మార్కెట్ ద్వారా ఆధారంగల పాలసీల విషయంలో సర్టిఫికెట్ ఆఫ్ ఇన్సూరెన్స్ పొందిన తేది నుంచి 30 రోజుల లోపున బీమా తీసుకున్న సభ్యులు, మాస్టర్ పాలసీదారుతో పాటు, పాలసీ నియమాలు మరియు నిబంధనలు సమీక్షించి మరియు ఏవైనా నియమాలు మరియు నిబంధనలతో బీమా తీసుకున్న సభ్యులు అసంతృప్తిగా ఉండి లేదా అంగీకరించకుంటే, అతని/ఆమె అభ్యంతరానికి కారణం తెలియజేస్తు సర్టిఫికెట్ ఆఫ్ ఇన్సూరెన్స్‌ని తిరిగి ఇచ్చే ఎంపిక మీకు ఉంటుంది. అలాంటి అన్ని అభ్యర్థనలు మాస్టర్ పాలసీదారు ద్వారా రావాలి. వెచ్చించిన స్టాంప్ డ్యూటీ కోసుకున్న తర్వాత మాస్టర్ పాలసీ ద్వారా చెల్లించిన ప్రీమియం తిరిగి ఇవ్వడం జరుగుతుంది.
  • ఋణ సదుపాయం
    ఈ పాలసీ కింద ఎలాంటి ఋణ సదుపాయం దొరకదు.
  • మినహాయింపులు
    • ఆత్మహత్య
      ఒకవేళ బీమా తీసుకున్న సమూహం సభ్యులు స్ప్రహతో లేక స్ప్రహ లేకుండా, రిస్కు ప్రారంభమైన తేది లేదా బీమా భద్రతను పునరుద్ధరించుకున్న తేది నుంచి ఒక్క సంవత్సరంలోపున ఆత్మహత్య చేసుకుంటే, సమూహం సభ్యునికి బీమా లాభాన్ని చెల్లించబడదు. అలాంటి సందర్భంలో, మృత్యువు తేది నాటికి, పాలసీ కింద సభ్యునికై చెల్లించిన ప్రీమియం యొక్క 80%కి అధికం లేదా సరెండర్‌ విలువను తిరిగి ఇవ్వడం జరుగుతుంది.

ఎస్‌బిఐ లైఫ్ – శక్తి యొక్క ప్రమాద కారకాలు, నిబంధనలు మరియు షరతులు గురించి మరిన్ని వివరాలు కోసం, కింది పత్రాలను జాగ్రత్తగా చదవండి.

null
$ వయసుకు సంబంధించిన అన్ని సూచికలు చివరి పుట్టిన రోజు నాటివి.
**వర్తించే విధంగా పలు పన్నులు మరియు సుంకాలు అదనంగా ఛార్జీ చేయడం జరుగుతుంది.
^అన్ని ఎస్‌బిఐ లైఫ్ సామూహిక సూక్ష్మ బీమా ప్లాన్ల జమా బీమా రాశిని ప్రతి జీవితానికి రూ. 2,00,000లు పరిమితం చేయడం జరుగుతుంది.

95.ver.01-03/18 WEB TEL

ఇందులో ఉండే రిస్కులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి కొనుగోలును నిర్ధారించడానికి ముందు విక్రయ కరపత్రాన్ని క్షుణ్ణంగా చదవండి.

పన్ను ప్రయోజనా
పన్ను ప్రయోజనాలు ఆదాయపు పన్ను చట్టాలకు అనుగుణంగా ఉంటాయి &సమయానుగుణంగా మారతాయి. దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారును సంప్రదించండి
ప్లాన్ ప్రయోజనాల విభాగం క్రింద ప్రతి ఉత్పత్తి పేజీలో మరొక పన్ను నిరాకరణ ఉంటుంది. భారతదేశంలో వర్తించే ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం పన్ను ప్రయోజనాలు/మినహాయింపులు ఉంటాయి. తదుపరి వివరాల కోసం, మీరు మా వెబ్సైట్ను సందర్శించవచ్చు దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారును సంప్రదించండి.