వ్యక్తిగత, నాన్ లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్యూర్ రిస్క్ ప్రీమియం ఉత్పత్తి
మీ కుటుంబ భవిష్యత్తును భద్రపరచుకునే భారాన్ని మీ భుజాల నుంచి మీ కొసవేళ్ళకు మార్చుకోండి. ఎస్‌బిఐ లైఫ్-ఈషిల్డ్ ఇప్పుడు జీవిత బీమాను పొందేందుకు సులభమైన మరియు నిరాటంకమైన ఆన్‌లైన్ ప్రక్రియ ప్రయోజనాన్ని అందిస్తుంది.
కుటుంబం కోసం ఆర్థిక భద్రత కావాలనుకునేవారి కోసం, ఎస్‌బిఐ లైఫ్-ఈషిల్డ్ అందుబాటైన ప్రీమియంకే ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.
ఈ ఆన్‌లైన్ ప్యూర్ టర్మ్ ప్లాన్ వీటిని అందిస్తుంది -
భద్రత - మీ కుటుంబం ఆర్థికంగా భద్రత పొందేలా చూసుకునేందుకు
సౌకర్యవంతమైనది - రెండు ప్రయోజన ఆకారాలు మరియు రెండు రైడర్ ఎంపికల మధ్య ఎంచుకోండి
సులభమైనది - సులభమైన ఆన్‌లైన్ ప్రక్రియతో
అందుబాటైనది - సహేతుకమైన ప్రీమియంలతో
విశ్వసనీయత - వైద్యపరమైన రెండవ అభిప్రాయంతో
కొన్ని సార్లు ఇలా క్లిక్ చేసి బీమా పొంది, మీ కుటుంబానికి భద్రతను కానుకగా ఇవ్వండి!
ముఖ్యాంశాలు
done
సాంప్రదాయమైన ప్లాన్
done
ప్రొటెక్షన్ ప్లాన్స్
done
టర్మ్ ప్లాన్
done
ఎస్‌బిఐ లైఫ్-ఈషిల్డ్
done
ఆన్‌లైన్ ప్లాన్
వ్యక్తిగత, నాన్ లింకెడ్, నాన్ పార్టిసిపేటింగ్ ఆన్‌లైన్ ఖచ్చితమైన టర్మ్ ప్లాన్
ఆర్థిక భద్రత అందించి మరియు మీ కుటుంబానికి భద్రత కలిగిస్తుంది
అంతర్నిర్మిత వేగవంతమైన టెర్మినల్ ఇల్నెస్ బెనిఫిట్ $ తో రెండు ప్రయోజన ఆకారాలు మరియు విస్తృత భద్రత కోసం రెండు రైడర్ ఎంపికలు .
నిరాటంకమైన ఆన్‌లైన్ ధరఖాస్తు ప్రక్రియ
పొగతాగని వారికి ప్రీమియంల పైన తగ్గింపులు
వైద్యపరమైన రెండవ అభిప్రాయం
ప్రయోజనాలు
భద్రత
మీరు ఎంచుకున్న ప్రయోజన ఆకారాలపై ఆధారపడి మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను పొందండి
సౌకర్యవంతమైనది
భద్రత అవసరాల ప్రకారం రెండు ప్రయోజన ఆకారాల నుంచి ఎంచుకోండి
విస్తృత భద్రత అందించేందుకు రెండు రైడర్ ఎంపికలు
సులభమైనది
సులభమైన ఆన్‌లైన్ దరఖాస్తు
అందుబాటైనది
అందుబాటైన ప్రీమియంలకే ఎన్నో ప్రయోజనాల ఆనందాన్ని పొందండి
పొగతాగని వారికి ప్రీమియం డిస్కౌంట్స్
విశ్వసనీయత
వైద్య నిపుణుల ప్యానెల్ ద్వారా రెండవ వైద్యపరమైన అభిప్రాయాన్ని పొందండి
పన్ను ప్రయోజనాలు పొందండి*
ప్రయోజన ఆకారం :
ప్లాన్ రెండు ప్రయోజన ఆకారాలను అందిస్తుంది - లెవెల్ కవర్ ప్రయోజనం మరియు పెంపొందించబడే కవర్ ప్రయోజనం. వేగవంతమైన టెర్మినల్ ఇల్నెస్ బెనిఫిట్$ రెండు ఆకారాలకు అంతర్‌నిర్మిత ప్రయోజనంగా దొరుకుతుంది.
లెవెల్ కవర్ ప్రయోజనం :
ఈ ఆకారం కింద పాలసీ వ్యవధి కొనసాగుతున్నంత కాలం బీమా రాశి అంతే ఉంటుంది
టర్మినల్ అనారోగ్యానికి మీరు భద్రత పొందుతారు#
పాలసీ వ్యవధి కొనసాగుతుండగా, దురదృష్టవశాత్తూ మరణం సంభవించినా లేదా మరణాంతక అనారోగ్య చికిత్స నిర్ధారణ# జరిగినా, ఏది ముందైతే అప్పుడు, "మరణం నాడు బీమా రాశి" చెల్లించడం జరుగుతుంది, అయితే దీని కోసం పాలసీ అమలులో ఉండాలి, తర్వాత పాలసీ ముగించబడుతుంది
దీనిలో ``మృత్యువు నాటి బీమా రాశి''దిగువపేర్కొన్నవాటిలోఅధికమైనది:
వార్షిక ప్రీమియం కంటే 10 రెట్లు**, లేదా
మృత్యువు తేది నాటికి స్వీకరించిన మొత్తం ప్రీమియమ్స్ యొక్క 105%, లేదా
మృత్యువు నాడు ఖచ్చితంగా చెల్లించవలసిన మొత్తం, అది మృత్యువు తేది నాడు ప్రభావితమైన బీమా రాశికి## సమానంగా ఉంటుంది.
##మృత్యువు తేది నాటి లెవెల్ కవర్ ప్రయోజనం కొరకు ప్రభావిత బీమా రాశి అనేది ఎంచుకున్న ప్రాథమిక బీమా రాశి అవుతుంది.
పెంపొందించబడే కవర్ ప్రయోజనం :
ఈ ఆకారం కింద ప్రతి 5వ పాలసీ సంవత్సరం ముగింపులో బీమా రాశి దానంతటదే 10% సరళ వడ్డీ చొప్పున పెరుగుతుంది.
టర్మినల్ ఇల్‌నెస్‌కి మీరు భద్రత పొందుతారు#
పాలసీ వ్యవధి కొనసాగుతుండగా, దురదృష్టవశాత్తూ మరణం సంభవించినా లేదా మరణాంతక అనారోగ్య చికిత్స నిర్ధారణ# జరిగినా, ఏది ముందైతే అప్పుడు, ''మరణం నాడు బీమా రాశి'' ఆ పాలసీ సంవత్సరానికి చెల్లించడం జరుగుతుంది, అయితే దీని కోసం పాలసీ అమలులో ఉండాలి, తర్వాత పాలసీ ముగించబడుతుంది.
దీనిలో ``మృత్యువు నాటి బీమా రాశి'' దిగువ పేర్కొన్నవాటికంటే అధికం:
వార్షిక ప్రీమియం కంటే 10 రెట్లు**, లేదా
మృత్యువు తేది నాటికి స్వీకరించిన మొత్తం ప్రీమియమ్స్ యొక్క 105%, లేదా
మృత్యువు నాడు ఖచ్చితంగా చెల్లించవలసిన మొత్తం, అది మృత్యువు తేది నాడు ప్రభావితమైన బీమా రాశికి~~ సమానంగా ఉంటుంది.
~~మృత్యువు తేది నాటి పెంపొందించబడిన కవర్ ప్రయోజనం కొరకు ప్రభావిత బీమా రాశి అనేది మృత్యువు తేదికి ముందు ప్రతి 5వ పాలసీ సంవత్సరం నాడు 10% సరళ వడ్డీ తో పెరిగిన ఎంచుకున్న ప్రాథమిక బీమా రాశి.
#టర్మినల్ ఇల్‌నెస్ అనేది జీవిత బీమా తీసుకున్నవారు 180 రోజులలోపున మరణించే సంభావ్యత ఉందని అనారోగ్య చికిత్స నిర్ధారణ జరగడం అని నిర్వచించబడింది.
**వార్షిక ప్రీమియం అంటే వీటిలో ఏవైనా ఉంటే, పన్నులు, రైడర్ ప్రీమియమ్స్, అండర్‌వ్రైటింగ్ అదనపు ప్రీమియంలు మరియు మొడల్ ప్రీమియంల కొరకు లోడింగ్స్‌ను మినహాయించి పాలసీదారు ద్వారా సంవత్సరంలో చెల్లించవలసిన ప్రీమియం.
^^స్వీకరించిన మొత్తం ప్రీమియమ్స్ అంటే ఏదైనా అదనపు ప్రీమియం, ఏదైనా రైడర్ ప్రీమియం మరియు పన్నుల మినహాయింపుతో స్వీకరించిన మొత్తం ప్రీమియం.
మరణ ప్రయోజనం:
ఎంచుకున్న లాభం ఆకారం పైన ఆధారపడి, నామిని ``మృత్యువు నాటి బీమా రాశి'' పొందుతారు.
పాలసీదారు ఆ తేది నాటికి క్రమబద్ధమైన అన్ని ప్రీమియంలు మరియు జీవిత బీమాదారు మరణించిన తేదినాటికి పాలసీ అమలులో ఉంటే మరణ ప్రయోజనం చెల్లించడం జరుగుతుంది
$పెంపొందించబడిన టర్మినల్ ఇల్‌నెస్ ప్రయోజనం :
రెండు ప్రయోజన ఆకారాలతో ఈ అంతర్నిర్మిత ప్రయోజనం అందుబాటులో ఉంటుంది.
జీవిత బీమా తీసుకున్నవారికి టర్మినల్ ఇల్‌నెస్ చికిత్సనిర్ధారణ జరిగితే, మరణ ప్రయోజనానికి సమానమైన లాభాన్ని చెల్లించి పాలసీని ముగించడం జరుగుతుంది.
మీరు ఆ తేది నాటికి క్రమబద్ధమైన అన్ని ప్రీమియంలు చెల్లించి మరియు చికిత్స నిర్ధారణ తేది నాడు మీ పాలసీ అమలులో ఉంటే వేగవంతమైన టర్మినల్ ఇల్‌నెస్ ప్రయోజనం చెల్లించబడుతుంది. టర్మినల్ ఇల్‌నెస్ క్లెయిం మూలంగా పాలసీ ముగిసిపోతుంది.
టర్మినల్ ఇల్‌నెస్ అనేది జీవిత బీమా తీసుకున్నవారు 180 రోజులలోపున మరణించే సంభావన ఉందని అనారోగ్య చికిత్సనిర్ధారణ జరగడం అని నిర్వచించబడింది.
వైద్యపరమైన రెండవ అభిప్రాయం:
వైద్యపరమైన రెండవ అభిప్రాయం అనే సర్వీసులో, జీవిత బీమా తీసుకున్నవారికి వారి రోగ నిర్ధారణ విషయంలో రెండవ అభిప్రాయాన్ని తీసుకొని మరియు వేరే డాక్టర్ ద్వారా చికిత్స ప్రణాళికలకు వీలుకలిగిస్తుంది.
రెండు ప్రయోజన ఆకారాల కింద అంటే లెవెల్ కవర్ ప్రయోజనం మరియు పెరిగే కవర్ ప్రయోజనంకు లభిస్తుంది. పాలసీ అమల్లో ఉన్నప్పుడు అందించబడుతుంది .
మేచ్యురిటి ప్రయోజనం:
ఈ ప్లాన్ ఎలాంటి మేచ్యురిటి లాభాన్ని అందించదు.
రైడర్ ప్రయోజనం:
ఎస్‌బిఐ లైఫ్ - ఎక్సిడెంటల్ డెథ్ బెనెఫిట్ రైడర్ (UIN: 111B015V03) - రైడర్ పాలసీ అమలులో ఉండి దుర్ఘటన మూలంగా దుర్ఘటన జరిగిన 120 రోజుల లోపున జీవిత బీమా తీసుకున్నవారు మరణిస్తే రైడర్ బీమా రాశి చెల్లించడం జరుగుతుంది.
ఎస్‌బిఐ లైఫ్ - ఎక్సిడెంటల్ టోటల్ అండ్ పర్మనెంట్ డిసెబిలిటీ బెనెఫిట్ రైడర్ (UIN: 111B016V03) - రైడర్ పాలసీ అమలులో ఉండి రైడర్ వ్యవధి కొనసాగుతున్నప్పుడు జీవిత బీమా తీసుకున్నవారికి పూర్తి మరియు శాశ్వత వైకల్యం సంభవిస్తే రైడర్ బీమా రాశి చెల్లించడం జరుగుతుంది.
ఎస్‌బిఐ లైఫ్ - ఈషిల్డ్‌కి సంబంధించిన రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనల పూర్తి వివరాల కోసం దిగువ పేర్కొన్న డాక్యుమెంట్లను శ్రద్ధగా చదవండి.
^వయసుకు సంబంధించిన అన్ని సూచికలు చివరి పుట్టిన రోజు నాటివి.
$$పైన పేర్కొన్న ప్రీమియంలు వర్తించే పన్నులు మరియు అదనపు అండర్‌వ్రైటింగ్ మినహాయింపుతో. వర్తించే పన్ను నిబంధనల ప్రకారం పన్నులు వర్తిస్తాయి.
1G.ver.02-04-21 WEB TEL
కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకునేముందు రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం దయచేసి అమ్మకాల బ్రోచర్‌ని శ్రద్ధగా చదవండి.
రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనలకు సంబంధించిన రైడర్స్ వివరాల కోసం దయచేసి రైడర్ బ్రోచర్‌ని శ్రద్ధగా చదవండి.
*పన్ను ప్రయోజనా
కాలానుగుణంగా భారతదేశంలోని వర్తించే ఆదాయం పన్ను నిబంధనల ప్రకారం మీరు పన్ను ప్రయోజనాలు/ మినహాయింపులకు అర్హత పొందుతారు. వివరాల కోసం దయచేసి పన్ను సలహాదారులను సంప్రదించండి. మరిన్ని వివరాల కోసం మీరు మా వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చు.