Give Life Cover to Child with SBI Life - Smart Future Star.
SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ ఫ్యూచర్ స్టార్

UIN: 111N172V01

Product Code: 3X

play icon play icon
SBI Life – Smart Future Star Plan

నేడు మీ చిన్నారి
భవిష్యత్తును సమృద్ధం చేసి
రేపు స్వేచ్ఛ కలిగించండి.

ఒక వ్యక్తిగతమైన, నాన్-లింక్డ్, పార్టిసిపేటింగ్, లైఫ్ ఇన్సూరెన్స్ పొదుపుల ఉత్పత్తి.

తల్లిదండ్రులుగా, మీ జీవితం అంతా మీ చిన్నారి మరియు వారి భవిష్యత్తు మైలురాళ్ల పైనే ఉంటుంది, వాటిలో విద్యాభ్యాసం, వృత్తిపరమైన డిగ్రీలు, వివాహం, వ్యవస్థాపక కలలు, ఇంకా ఎన్నెన్నో ఉంటాయి. మీ చిన్నారి కలలు మరియు ఆకాంక్షలకు ప్రాధాన్యత అందించేందుకు, మీరు సరైన సమయంలో తెలివైన ప్రణాళిక వేయవలసి ఉంటుంది. ఇలా చేయడంతో వారికి అత్యవసరం ఉన్నప్పుడు మూల ధనం స్వేచ్ఛ కలిగించవచ్చు.

ఎస్‌బిఐ లైఫ్‌లో మాకు దీని గురించి తెలుసు, అందుకే సమర్పిస్తున్నాము ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ ఫ్యూచర్ స్టార్, ఇదో వ్యక్తిగతమైన, నాన్-లింక్డ్, పార్టిసిపేటింగ్, లైఫ్ ఇన్సూరెన్స్ పొదుపుల ఉత్పత్తి. ఈ ఉత్పత్తి మీ పొదుపులను పెంపొందించేందుకు బోనసులను మరియు మీ చిన్నారి ఆర్థిక భవిష్యత్తుకు భద్రత కలిగించేందుకు ఏకమొత్తంలో మెచ్యూరిటీ మొత్తాన్ని అందిస్తుంది. ఇక మరోవైపు దీని అంతర్నిర్మిత ప్రీమియం సడలింపు మనశ్శాంతిని అందిస్తుంది. ఇంకా మీ చిన్నారి అవసరాలు మరియు ఆకాంక్షలకు ప్రణాళిక రూపొందించేందుకు సౌలభ్యాన్ని కూడా పొందుతారు. ఇక మీ చిన్నారి తన భవిష్యత్తుకు స్టార్‌లా నిలవనున్నాడు.

ముఖ్య అంశాలు

ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ ఫ్యూచర్ స్టార్

A non-participating Unit Linked Insurance Plan

plan profile

Akshay, has ensured his 4-year old daughter, Myra, will never have to compromise on her dreams for want of funds, through this child plan.

Change the form fields below to see how you can secure your child's future with SBI Life – Smart Future Star

Name:

DOB:

Gender:

Male Female Third Gender

Staff:

Yes No

Proposer Name:

Proposer DOB:

Proposer Gender:

Male Female Third Gender

Choose your policy term...

Channel Type

Policy Term

15 25

A little information about the premium options...

Premium Frequency

Sum Assured

4 Lakh No limit

Premium Paying Term


Reset
sum assured

Sum Assured


premium frequency

Premium frequency

Premium amount
(excluding taxes)


premium paying

Premium Payment Term


policy term

Policy Term


maturity benefits

Maturity Benefit

At assumed rate of returns** @ 4%


or
@ 8%

Give a Missed Call

ప్రత్యేకతలు

పొదుపులు: మెచ్యూరిటీతో బీమా రాశి, ఇంకా ఆర్జిత బోనసులు, వెల్లడిస్తే, ఏకమొత్తం లాభం రూపంలో చెల్లించడం జరుగుతుంది.

మెచ్యూరిటీ చెల్లింపులను ఏకమొత్తంలో వాయిదా వేసుకోవచ్చు లేదా దానిని ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో పొందే ఎంపిక.

పన్ను లాభాలు^: ఆదాయం పన్ను చట్టం, 1961 కింద ప్రస్తుత నిబంధనల ప్రకారం పన్ను లాభాలు.
 

^భారతదేశ ఆదాయం పన్ను చట్టాల వర్తింపు ప్రకారం మీరు ఆదాయం పన్ను లాభాలకు అర్హత పొందుతారు. ఇవి కాలానుగుణంగా మారుతుంటాయి. మరింత సమాచారం కోసం దయచేసి పన్ను సలహాదారులను సంప్రదించండి.
ఈ ప్లాన్‌లో జీవిత బీమాదారు మైనర్ చిన్నారి అయితే, తల్లిదండ్రులు లేదా తాతా, అమ్మమ్మ, బామ్మలు లేదా చట్టబద్ధమైన సంరక్షకులు పాలసీదారు/ప్రతిపాదించువారు కావచ్చునని దయచేసి గమనించండి. ఇది మా బోర్డ్ ఆమోదిత అండర్‌రైటింగ్ పాలసీ ప్రకారం ఉంటుంది. ప్రీమియం భద్రత సడలింపు ప్రతిపాదించువారి జీవితానికి ఉంటుంది. 18 సంవత్సరాలు నిండిన వెంటనే లేదా ఆ తర్వాత పాలసీ వార్షికోత్సవం నాడు ఈ పాలసీ ఆటోమేటిక్‌గా జీవిత బీమాదారుకు చెందుతుంది, ఇక అలా చెందడంతో ఒప్పందం కంపెనీ మరియు జీవిత బీమాదారు మధ్యలో ఉంటుంది.
పాలసీ ప్రారంభం తేదీ మరియు రిస్కు ప్రారంభ తేదీ ఒకటే ఉంటుంది. ప్రీమియం చెల్లింపు వ్యవధి అంతా ప్రీమియం స్థిరంగా ఉంటుంది.

ప్రయోజనాలు

భద్రత

  • చిన్నారికి జీవిత భద్రత మరియు మృత్యువుతో అంతర్నిర్మిత "ప్రీమియం సడలింపు" లాభం లేదా ప్రతిపాదించినవారికి దుర్ఘటన పూర్తి శాశ్వత వైకల్యం.

సౌలభ్యం

  • పరిమిత ప్రీమియం చెల్లింపు వ్యవధి 7, 10 మరియు 12 సంవత్సరాలు మరియు పాలసీ వ్యవధి 15 నుంచి 25 సంవత్సరాలు

సులభత్వం

  • సులభమైన దరఖాస్తు ప్రక్రియ మరియు ఝంఝాట-రహితమైన జారీ చేసే విధానంతో కొనుగోలు చెయ్యండి

విశ్వసనీయత:

  • ‘మెచ్యూరిటీ నాటి బీమా రాశి + గడువు ముగింపు పునరుద్ధరణ బోనసులు + ముగింపు బోనస్, ఏదైనా వెల్లడిస్తే’ వీటికి సమానమైన ఏకమొత్తంలో మెచ్యూరిటీ లాభాన్ని పొందండి.

ప్రతిపాదించినవారి మృత్యువుతో లేదా దుర్ఘటన పూర్తి శాశ్వత వైకల్యం (ఎటిపిడి)తో ప్రీమియం సడలింపు:

ప్రీమియం చెల్లింపు వ్యవధి కొనసాగుతుండగా, పాలసీ అమలులో ఉండి, ప్రతిపాదించినవారు మరణించినా లేదా దుర్ఘటన పూర్తి శాశ్వత వైకల్యం (ఎటిపిడి) సంభవించినా, మృత్యువు తేదీ లేదా ఏటిపిడి తర్వాత పాలసీ కింద చెల్లించవలసిన భవిష్యత్తు ప్రీమియమ్స్ (ఏవైనా ఉంటే) సడలించడం జరుగుతుంది మరియు అమలులో ఉన్న పాలసీ విధంగా పాలసీ కొనసాగుతుంది.
 

దుర్ఘటన అంటే, అకస్మాత్తుగా కనిపించే బాహ్య మరియు అపాయకరమైన అనూహ్య మరియు అసంకల్పిత సంఘటన తలెత్తి శరీరానికి గాయం కలగడం, కాని అనారోగ్యం మరియు వ్యాధుల మినహాయింపుతో ఉంటుంది.

పూర్తి శాశ్వత వైకల్యం అంటే జీవిత బీమా తీసుకున్నవారికి దుర్ఘటన మూలంగా దిగువ పేర్కొన్న ఏదైనా ఒక (లేదా ఎక్కువ వైకల్యాలు సంభవించడం:

  1. ఏ. పూర్తిగా మరియు శాశ్వతంగా రెండు కళ్ల దృష్టి కోల్పోవడం, లేదా
  2. బి. రెండు అవయవాలు లేదా మణికట్టు లేదా చీలమండలం పై భాగంలో శారీరక తీవ్రత కోల్పోవడం (లేదా పూర్తి మరియు శాశ్వత వాడకం కోల్పోవడం), లేదా
  3. సి. ఒక్క కన్ను పూర్తి మరియు శాశ్వత కంటి చూపు కోల్పోవడం మరియు ఒక్క అవయవం లేదా మణికట్టు లేదా చీలమండ పై భాగంలో శారీరక తీవ్రత కోల్పోవడం (లేదా పూర్తి మరియు శాశ్వత వాడకం కోల్పోవడం)
 
 

దుర్ఘటన పూర్తి శాశ్వత వైకల్యం అంటే పూర్తి శాశ్వత వైకల్యం:

  1. ఏ. ఇది సంభవించవచ్చు దుర్ఘటన మూలంగా శరీరానికి గాయంతో, మరియు
  2. బి. ఇలా ఇతర ఏదైనా కారణాల మూలంగా పేర్కొన్న శారీరక గాయం మూలంగా పూర్తిగా, నేరుగా మరియు స్వేచ్ఛగా కలగడం, మరియు
  3. సి. అలాంటి దుర్ఘటన సంభవించిన 180 రోజుల లోపున అలా జరగడం మరియు
  4. డి. దిగువ పేర్కొన్నవాటికి లోబడి పాలసీ వ్యవధి ముగిసిన తర్వాత కూడా వైకల్యం కలిగితే లాభాలను చెల్లించడం జరుగుతుంది:
    1. పాలసీ అమలులోవున్నప్పుడు దుర్ఘటన సంభవించడం
    2. ఈ దుర్ఘటన తర్వాత 180 రోజులలోపున దుర్ఘటన వైకల్యం సంభవించడం
 

దయచేసి చెల్లించబడే దుర్ఘటన పూర్తి శాశ్వత వెకల్యం క్లెయిం గురించి తెలుసుకోండి. అలాంటి వైకల్యం కనీసం 180 రోజులు నిరంతరం కొనసాగివుండాలి మరియు అది శాశ్వతం అని కంపెనీ ద్వారా నియమించబడిన సరైన వైద్యుని ద్వారా నిర్ణయించబడాలి. శారీరక తెగతెంపుల విషయంలో శాశ్వతత్వాన్ని నిర్ధారించేందుకు 180 రోజుల వేచివుండే వ్యవధి వర్తించదు.

మెచ్యూరిటీ లాభం:

పాలసీ అమలులో ఉండి, పాలసీ వ్యవధి ముగింపు వరకు చిన్నారి (జీవిత బీమాదారు) బతికివుంటే, దిగువ పేర్కొన్న ఏకమొత్తం చెల్లించడం జరుగుతుంది:
  1. మెచ్యూరిటీ నాటి బీమా రాశి ఇంకా వెస్టెడ్ రివర్షనరీ బోనస్‌లు, వెల్లడిస్తే, ఇంకా ముగింపు బోనస్, ఏదైనా ఉంటే.
  2. పాలసీ మెచ్యూరిటీతో పాలసీ ముగించబడుతుంది, ఇక ఎలాంటి మునుముందు లాభాలు చెల్లించబడవు.

దీనిలో, మెచ్యూరిటీ నాటి బీమా రాశి^ అనేది బీమా రాశికి సమానం.
^బీమా రాశి అనేది పాలసీ ప్రారంభంలో పాలసీదారుని ద్వారా ఎంచుకున్న ఖచ్చితమైన మొత్తం.

జీవిత బీమా తీసుకున్నవారికి మృత్యువు లాభం:

పాలసీ అమలులో ఉండి, పాలసీ వ్యవధి కొనసాగుతుండగా, చిన్నారి (జీవిత బీమాదారు) మరణిస్తే, నామినీ లేదా చట్టబద్ధమైన వారసునికి దిగువ పేర్కొన్న అధికం ఏకమొత్తంలో చెల్లించడం జరుగుతుంది:
 
  1. మృత్యువు నాటి బీమా రాశి ఇంకా వెస్టెడ్ రివర్షనరీ బోనస్‌లు, వెల్లడిస్తే, ఇంకా ముగింపు బోనస్, ఏదైనా ఉంటే.
  2. లేదా
  3. మృత్యువు తేదీ వరకు చెల్లించిన# పూర్తి ప్రీమియం యొక్క 105%
 

దీనిలో, మృత్యువు నాటి బీమా రాశి బీమా రాశికి^ అధికం లేదా వార్షిక ప్రీమియం యొక్క 11 రేట్లు*
*వార్షిక ప్రీమియం సంవత్సరంలో పాలసీదారు ఎంచుకున్న చెల్లించవలసిన ప్రీమియం మొత్తం, ఏవైనా ఉంటే పన్నులు, అండర్‌రైటింగ్ ఎక్స్‌ట్రా ప్రీమియమ్స్ మరియు మోడల్ ప్రీమియం లోడింగ్ మినహా.
^బీమా రాశి అనేది పాలసీ ప్రారంభంలో పాలసీదారుని ద్వారా ఎంచుకున్న ఖచ్చితమైన మొత్తం.
#ప్రత్యేకంగా తీసుకున్న ఏదైనా అదనపు ప్రీమియం మరియు పన్నుల మినహాయింపుతో, చెల్లించిన అన్ని ప్రీమియమ్స్ అంటే ప్రాథమిక ఉత్పత్తి కింద చెల్లించిన అన్ని ప్రీమియమ్స్ మొత్తం.


పునఃసమకూర్చే బోనస్, ఏదైనా ఉంటే, ప్రతి ఆర్థిక సంవత్సరం ముగింపులో చట్టబద్ధమైన నిర్ధారణ మేరకు మిగులు పెంపొందించినవాటి ఆధారంగా వెల్లడించడం జరుగుతుంది.
అమలులో ఉన్న పాలసీకి మాత్రమే పునఃసమకూర్చే బోనస్ వర్తిస్తుంది మరియు ఒకసారి వెల్లడించడంతో పాలసీకి జతచేయడం జరుగుతుంది.
పునఃసమకూర్చే బోనసు ధరను బీమా రాశి శాతంగా పేర్కొనడం జరుగుతుంది.

ముగింపు బోనస్, ఒకవేళ వెల్లడిస్తే, పాలసీ మృత్యువు, అప్పగింత లేదా మెచ్యూరిటీ మూలంగా క్లెయిం కోసం వస్తే చెల్లించడం జరుగుతుంది.
ముగింపు బోనస్‌ని ఆర్జిత పునఃసమకూర్చే బోనసుల శాతంగా వెల్లడించడం జరుగుతుంది.

ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ ఫ్యూచర్ స్టార్-కి సంబంధించిన రిస్క్ అంశాలు, నియమాలు మరియు నిబంధనల పూర్తి వివరాల కోసం దిగువ పేర్కొన్న డాక్యుమెంట్లను శ్రద్ధగా చదవండి.

SBI Life – Smart Future Star Plan
**వయసుకు సంబంధించిన అన్ని సూచికలు చివరి పుట్టిన రోజు నాటివి.

3X/ver1/03/25/WEB/TEL

*పన్ను ప్రయోజనాలు:
పన్ను లాభాలు, ఆదాయ పన్ను నియమాల ప్రకారం ఉంటాయి మరియు కాలానుగుణంగా మార్పునకు లోబడి ఉంటాయి. వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారుని సంప్రదించండి.
కాలానుగుణంగా భారతదేశంలోని వర్తించే ఆదాయం పన్ను చట్టాల ప్రకారం మీరు పన్ను ప్రయోజనాలు/మినహాయింపులకు అర్హత పొందుతారు, అది నియమాల ప్రకారం కాలానుగుణంగా మార్పునకు లోబడి ఉంటాయి. మరిన్ని వివరాల కోసం, ఇక్కడ క్లిక్ చెయ్యండి. వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారుని సంప్రదించండి.