యూనిట్ అనుసంధానిత గ్రూప్ బీమా ప్లాన్ | కల్యాణ్ యులిప్ ప్లస్ - ఎస్‌బిఐ లైఫ్
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

ఎస్‌బిఐ లైఫ్ - కళ్యాణ్ యూలిప్ ప్లస్

UIN: 111L079V03

ఉత్పత్తి కోడ్ : 74

ఎస్‌బిఐ లైఫ్ - కళ్యాణ్ యూలిప్ ప్లస్

శ్రద్ధ చూపే సాంప్రదాయాన్ని అలవరచుకొని,
మీ ఉద్యోగుల భవిష్యత్తుకు
భద్రత కలిగించుకోండి.

'యూనిట్-లింక్డ్, నాన్‌-పార్టిసిపేటింగ్‌, గ్రూప్‌ పెన్షన్ ఉత్పత్తి'.


ఈ ఫండ్స్‌ని నిర్వహించుకోవడంలో ఝంఝాటం లేకుండా మీ ఉద్యోగులకు తప్పకుండా ఉండవలసిన భద్రత మరియు పొదుపుల ఉత్పత్తులను అందించాలనుకుంటున్నారా?


ఎస్‌బిఐ లైఫ్ - కళ్యాణ్ యూలిప్ ప్లస్ అనేది యజమాని-ఉద్యోగుల సమూహాల కొరకు ప్లాన్. ఇది ఒకే చోట అన్ని సమాధానాలను అందిస్తుంది, ఇది గ్రాట్యుటి, సెలవులను నగదుగా మార్చుకోవడం మరియు మీ ఉద్యోగుల కోసం పదవీవిరమణ స్కీములకు, ఇక మరోవైపు ప్రభావవంతమైన ఫండ్‌తో మీరు లాభాన్ని పొందుతారు.


ఈ  ప్లాన్ అందిస్తుంది –
  • భద్రత - మీ ఉద్యోగి భద్రత పట్ల జాగ్రత్తవహిస్తు, పదవీవిరమణ అవసరాలను తీర్చుతుంది
  • విశ్వసనీయత - అంకితభావంగల సర్వీసు సిబ్బంది
  • సౌలభ్యం -  మీ అవసరాల ప్రకారం ఉద్యోగులకు స్కీమును రూపొందించండి

ఉద్యోగులు వారి ఆర్థిక భవిష్యత్తుకు భద్రత కలిగించుకొని వారి జీవితాలను పరిపూర్ణంగా తీర్చిదిద్దుకునే సాధికారిత అందించండి.

ముఖ్యాంశాలు

ఎస్‌బిఐ లైఫ్ - కళ్యాణ్ యూలిప్ ప్లస్

'నాన్-పార్టిసెపేటింగ్, యూనిట్-లింకెడ్ ఫండ్ ఆధారిత సమూహ ఇన్స్యూరెన్స్ ప్లాన్'.

ప్రత్యేకతలు

  • ఉద్యోగి లాభం స్కీముల కోసం అనుభవంగల మరియు నైపుణ్యంతో కూడిన ఫండ్ నిర్వహణ
  • అధిక లాయల్టీ జమా ధరను  అందించేందుకు సమ్మేళన లాభం
  • క్రమబద్ధమైన ట్రాన్స్‌ఫర్ ఎంపికతో ఆరు ఫండ్ ఎంపికలు
  • నిర్ధిష్టమైన లాభం (డిబి) లేదా నిర్ధిష్టమైన జమా (డిసి) స్కీములను లెదా కలయికలను నిర్వహించవచ్చు
  • ఉచితంగా అపరిమిత ఆన్‌లైన్ ఫండ్ మార్పిడిలు మరియు సెలవుల నగదీకరణ మరియు గ్రాట్యుటి స్కీముల కింద జమాల పునఃనిర్దేశాలు

ప్రయోజనాలు

భద్రత
  • ఉద్యోగులు ఉద్యోగం చేస్తున్నప్పుడు వారు జమా చేసుకున్న మూలధనాన్ని పొందుతారు
  • ఏదైనా అనూహ్యమైన సంఘటన తలెత్తుతే వారి లాభానికి అర్హులకు ఆర్థిక భద్రత
  • అదే మాస్టర్ పాలసీదారు ఏకైక లేదా సామూహిక కంపెనీల బహుళ పాలసీలను జతచేసి అధిక లాయల్టీ జమాలు
విశ్వసనీయత
  • మీ కార్యనిర్వహణ అవసరాలను తీర్చేందుకు అంకితభావంగల సర్వీసులు
సౌలభ్యం
  • క్రమబద్ధమైన మార్పిడి ఎంపికతో పెట్టుబడి రిస్కును తగ్గించుకోవడం 
  • స్కీము రకం పైన ఆధారపడి మాస్టర్ పాలసీ లేదా సభ్యత్వం లెవెల్‌లో ఫండ్ నిర్వహణ
పొందండి పన్ను లాభాలు*

స్కీము లాభం:

స్కీము నియమాల పైన ఆధారపడి, మృత్యువు, పదవీవిరమణ, రాజీనామా, విడిపించుకోవడం లేదా విరమించుకునే ఇతర కారణాల మూలంగా లాభాలను చెల్లించడం జరుగుతుంది. ఈ లాభాలను వర్తించే విధంగా మాస్టర్ పాలసీదారు లేదా సభ్యుల పాలసీ ఖాతా నుంచి చెల్లించడం జరుగుతుం.


బీమా లాభం :

ఒకవేళ సభ్యుడు మరణిస్తే, నామినికి రూ. 1,000 బీమా రాశి చెల్లించడం జరుగుతుంది.
ఈ లాభం సెలవుల నగదీకరణ మరియు గ్రాట్యుటి స్కీముల కింద దొరుకుతుంది మరియు స్కీముల లాభానికి అదనంగా చెల్లించడం జరుగుతుంది.


ఈ పాలసీ కింద పెట్టుబడికి సంబంధించిన రిస్కును గమనించండి - 
  • యూనిట్ ఆధారిత లైఫ్ ఇన్సూరెన్స్‌ ఉత్పత్తులు, సంప్రదాయకమైన ఉత్పత్తులకు భిన్నమైనవి మరియు మార్కేట్ రిస్క్‌లకు లోబడి ఉంటాయి.
  • యూనిట్ లింక్డ్‌ లైఫ్ ఇన్సూరెన్స్‌ఆధారిత పాలసీలో చెల్లించిన ప్రీమియమ్, క్యాపిటల్ మార్కెట్లకు సంబంధించిన పెట్టుబడి ప్రమాదాలకు లోబడి ఉంటాయి మరియు ఫండ్ యొక్క పనితీరు, క్యాపిటల్ మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను బట్టి, యూనిట్ల యొక్క ఎన్‌ఎవి పైకి వెళ్ళవచ్చు లేదా కిందకు రావచ్చు. బీమా చేసిన వారే అతని/ఆమె నిర్ణయానికి బాధ్యులు.
  • ఫండ్ ఎంపికల యొక్క గతంలోని కార్యచరణ భవిష్యత్తు కార్యచరణకు సూచిక కాదు. ఈ పాలసీ కింద చెల్లించే లాభాలన్ని సమయ సమయాలకు వర్తించే పన్ను చట్టాలు మరియు ఆర్థిక అంశాలకు లోబడి ఉంటాయి, వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారులను సంప్రదించండి.
  • ఈ క్రాంట్రాక్ట్ క్రింద ప్రతిపాదించబడుతున్న రకరకాల ఫండ్స్, ఫండ్ యొక్క పేర్లేగానీ, ఈ పథకాల యొక్క నాణ్యతను, వాటికి భవిష్యత్తులోగల అవకాశాలను మరియు రాబడులను ఏ విధంగానూ సూచించవు.
  • ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కం.లి. ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క పేర్లు మరియు ఎస్‌బిఐ లైఫ్ -కల్యాణ్ యులిప్ ప్లస్, యూనిట్ ఆధారిత బీమా కాంట్రాక్ట్ యొక్క పేరు మాత్రమేగానీ, కాంట్రాక్ట్ యొక్క నాణ్యతను, దాని భవిష్యత్తులోని అవకాశాలను, రాబడులను ఏ విధంగానూ, సూచించవు.
  • దయచేసి సంబంధిత ప్రమాదాలను, వర్తించే చార్జీలను మీ ఇన్సూరెన్స్ లైఫ్‌ మిత్ర లేదా మధ్యవర్తి నుండి లేదా బీమా చేస్తున్న వారు ఇచ్చే పాలసీ పత్రం నుండి తెలుసుకోండి.

 పైన పేర్కొన్న సమాచారం ఎస్‌బిఐ లైఫ్-కళ్యాణ్ యూలిప్ ప్లస్ యొక్క సంక్షిప్త సారాంశం.  ఇవి ప్లాన్‌కి సంబంధించిన సంక్షిప్త ప్రత్యేకతలు మాత్రమే. కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకునేముందు రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం దయచేసి అమ్మకాల బ్రోచర్‌ని శ్రద్ధగా చదవండి.


పన్ను ప్రయోజనాలు:
భారతదేశంలోని వర్తించే  ఆదాయం పన్ను చట్టాలు ప్రకారం ఆదాయ పన్ను ప్రయోజనాలు/ మినహాయింలు, ఉంటాయి, అవి సమయ సమయానికి మార్పుకు లోబడి ఉంటాయి. వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారున్ని సంప్రదించండి..

ఎస్‌బిఐ  లైఫ్‌ - కళ్యాణ్ యూలిప్ ప్లస్‌కి  సంబంధించిన రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనల పూర్తి వివరాల కోసం దిగువ పేర్కొన్న డాక్యుమెంట్లను  శ్రద్ధగా చదవండి.

null
*స్కీము నియమాల ప్రకారం ఫండింగ్ అవసరాలతో ఫండింగ్ నివేదిక విశ్లేషణ ప్రకారం మరియు సుదీర్ఘ వ్యవధి ఉద్యోగి లాభం కొలబద్ధ పాలన ప్రమాణాల బాధ్యతల మేరకు మాస్టర్ పాలసీదారు ద్వారా ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది.

NW/74/ver1/04/22/WEB/TEL


*పన్ను ప్రయోజనాలు:
పన్ను లాభాలు, ఆదాయ పన్ను చట్టాల ప్రకారం ఉంటాయి మరియు సమయ సమయానికి మార్పుకు లోబడి ఉంటాయి. వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారున్ని సంప్రదించండి.

కాలానుగుణంగా భారతదేశంలోని వర్తించే ఆదాయం పన్ను చట్టాలు ప్రకారం మీరు పన్ను ప్రయోజనాలు/ మినహాయింపులకు అర్హత పొందుతారు, అది నియమాల ప్రకారం సమయ సమయానికి మార్పుకు లోబడి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం, ఇక్కడ క్లిక్ చెయ్యండి. వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారున్ని సంప్రదించండి.