ముంబయ్, సెప్టెంబర్ 28, 2011 - ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, ప్రముఖ ప్రైవేట్ లైఫ్ ఇన్సూరర్, ప్రపంచ వ్యాప్తంగా సుప్రసిద్ధ మిలియన్ డాలర్ రౌండ్ టేబుల్ (ఎండిఆర్‌టి) 2011 అవార్డ్ చేజిక్కించుకున్న ఏకైక భారతీయ జీవిత భీమా సంస్థగా తనదైన విశిష్టతను నిలుపుకుంది. వరుసగా మూడో సంవత్సరానిక ఎస్‌బిఐ లైఫ్ 2011లో 2,661 ఎండిఆర్‌టి సభ్యుల ఓట్లు పొందడం ద్వారా అంతర్జాతీయ సుప్రసిద్ధ లీగ్ శిఖరస్థాయిని చేరుకుంది. వీటిలో, 200 కోర్ట్ ఆఫ్ టేబుల్ (COT) మరియు 30 టాప్ ఆఫ్ టేబుల్ (టిఒటి) సభ్యత్వ ప్రతిపత్తిని సాధించాయి. ఎస్‌బిఐ లైఫ్ గత ఐదు సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తంగా తొలి అయిదు బీమా సంస్థల్లో ఒకటిగా స్థిరంగా స్థానం నిలుపుకుంది. ప్రపంచవ్యాప్తంగా, కంపెనీ 2007లో 5వ స్థానం, 2008లో 3వ స్థానం, 2009, 2010 మరియు 2011లో 1వ స్థానంలో నిలిచింది.
ప్రసిద్ధి, ప్రామాణికమైన అమ్మకాల నాణ్యత మరియు అత్యున్నత నైతిక ప్రమాణాలు వంటివి ఎండిఆర్‌టి బ్రాండ్ పేరుతో ముడిపడి ఉన్న కొన్ని ముఖ్య విలువలు. ఎండిఆర్‌టి సభ్యత్వం అనేది ప్రపంచ జీవిత బీమా మరియు ఆర్థిక సేవల సలహాదారులలో 1 శాతం కంటే తక్కువ మంది ద్వారా సాధించబడిన అత్యున్నత గౌరవం. జీవిత బీమా ప్రొఫెషనల్స్ ఎండిఆర్‌టి సభ్యత్వం కలిగి ఉండటాన్ని గొప్ప గౌరవంగా భావిస్తుంటారు.
| |
| ర్యాంక్ |
కంపెనీ పేరు |
దేశం |
2010 మంది సభ్యులు |
| 1 |
ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ |
ఇండియా |
2,661 |
| 2. |
న్యూయార్క్ లైఫ్ |
యుఎస్ఎ |
2,067 |
| 3. |
శాంసంగ్ లైఫ్ ఇన్సూరెన్స్ |
రిపబ్లిక్ ఆఫ్ కొరియా |
2,052 |
| 4. |
ఎల్ఐసి ఆఫ్ ఇండియా |
ఇండియా |
1,993 |
| 5. |
నార్త్ వెస్టర్న్ మ్యూచువల్ |
యుఎస్ఎ |
1,260 |
| 31 |
హెచ్‌డిఎఫ్‌సి స్టాండర్డ్ లైఫ్ |
ఇండియా |
489 |
| 21 |
ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ |
ఇండియా |
341 |
| 31 |
టాటా ఎఐజి లైఫ్ |
ఇండియా |
207 |
| 33 |
మాక్స్ న్యూయార్క్ లైఫ్ |
ఇండియా |
203 |
|
మిస్టర్. ఎమ్. ఎన్. రావ్, ఎండి & సిఇఒ, ఎస్‌బిఐ లైఫ్, చెప్పారు, "ఏజెంట్ మరియు బ్యాంక్ వద్ద ఉన్న ఇన్సూరర్ ఫెలిసిటేటర్ ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తిగత ఆర్థిక సలహాయొక్క విశ్వసనీయమైన వనరుగా కొనసాగుతున్నారు. ప్రపంచ వేదికపై మా విజయం మా పంపిణీదారులు అనుసరిస్తున్న ప్రొఫెషనల్ వైఖరిని నిరూపిస్తోంది. మా కస్టమర్లకు జీవిత బీమా సొల్యూషన్ల సరఫరా ఆధారిత సలహా బృందాన్ని అందించడానికి వారికి తగిన మద్దతును ఇవ్వడంపై మేం నిరంతరం దృష్టి పెడుతుంటాము."
మిస్టర్ రాజీవ్ గుప్తా, ఎక్జిక్యూటివ్ డైరెక్టర్, మార్కెటింగ్, ఎస్‌బిఐ లైఫ్ చెప్పారు "ఈ విజయం ప్రపంచ స్థాయి కార్యసాధకులుగా చూడబడే సృజనాత్మక క్వాలిటీ సలహాదారులుగా మా చిత్తశుద్ధిని నిరూపిస్తుంది. అవసరంపై ఆధారపడిన సొల్యూషన్లను అందించడానికి, వృత్తిపరమైన సలహా, సాటిలేని సర్వీస్ అనేవి ఆ సలహాదారులకు కీలకమైన అంశాలుగా కొనసాగుతాయి.
దేశంలో అత్యంత విశ్వసనీయ బృందాలలో ఒకదానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం, అత్యున్నత శిక్షణా కార్యక్రమం మరియు ఆకర్షణీయమైన రివార్డు మరియు గుర్తింపు కార్యక్రమాలు అనేవి ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరర్ సలహాదారులు అందించే కొన్ని ప్రయోజనాలు.
మిస్టర్ ఆనంద్ పెజవర్, కార్యనిర్వాహక డైరెక్టర్, మార్కెటింగ్, ఎస్‌బిఐ లైఫ్ చెప్పారు "ఆత్యున్నత ఉత్పాదకతా రిటైల్ ఏజెన్సీ ఛానెల్‌కి అదనంగా మా సమీకృత బ్యాంక్ అస్యూరెన్స్ వైఖరి కూడా బ్యాంక్ కస్టమర్లు మరియు మా ఉత్పత్తులను అందిస్తున్నవారి కోసం సృజనాత్మక విలువను సృష్టించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఇన్సూరెన్స్ ఉత్పత్తుల అమ్మకంలో మునిగి ఉన్న బ్యాంక్ ఉద్యోగి, తన కస్టమర్లకు స్పర్థాత్మకమైన బ్యాంకింగ్ మరియు ఇన్సూరెన్స్ సొల్యూషన్స్ సరఫరా చేయడానికి వేగంగా స్పందించడం ద్వారా బ్యాంకును నిజంగానే అన్ని ఆర్థిక అవసరాలకు సూపర్ మార్కెట్‌గా తయారు చేస్తున్నాడు".
2011 జూన్‌తో ముగిసే తొలి ఆర్థిక త్రైమాసికం కాలంలో ఎస్‌బిఐ లైఫ్ రూ. 144 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే సంస్థ 27% వృద్ధిని నమోదు చేసింది. కంపెనీ మొత్తం ప్రీమియం 13 % రూ. లకు పెరింగింది. ఈ కాలంలో 1935 కోట్లు పెరిగింది ఈ కాలంలో సేకరించిన కొత్త బిజినెస్ ప్రీమియం రూ. వద్ద నిలిచింది. 892 కోట్లు. పైగా గత సంవత్సరంతో పోలిస్తే ఇదే కాలానికి ఈ సంవత్సరం యాజమాన్యం కింది ఆస్తులు మరింతగా 33% పెరిగింది. 2011 జూన్ 30 నాటికి 40,070 కోట్లకు పెరిగింది. కంపెనీ, పరిశ్రమలో 10.14% నిష్పత్తితో జిడబ్ల్యూపి ((గ్రాస్ రిటన్ ప్రీమియం)
ప్రత్యేకించి, కఠినమైన బాహ్య కారణాలు ఉన్నప్పటికీ, ఎస్‌బిఐ లైఫ్ తన ఉనికిని విస్తరించడం కొనసాగిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, కంపెనీ 81 శాఖలను ప్రారంభించింది, 1657 మంది ఉద్యోగులను నియమించింది.
2011 జూలై ఐఆర్‌డిఎ తాజా నివేదిక ప్రకారం ఎస్‌బిఐ లైఫ్ ప్రైవేట్ సంస్థలలో అగ్రస్థానం పొందింది. కంపెనీ ప్రైవేట్ జీవిత బీమా సంస్థలలో 21.6% మార్కెట్ షేర్‌ని మరియు మొత్తం మార్కెట్ షేర్‌లో 6% కలిగివుంది.
ఎంఐడిఆర్‌టి గురించి:
ఎండిఆర్‌టి ప్రపంచ అత్యుత్మమ జీవిత బీమా సేల్స్ (సలహాదారులు) ప్రొఫెషనల్స్ కూడిన అసోసియేషన్. 1927లో స్థాపించబడిన ఎండిఆర్‌టి ఒక అంతర్జాతీయ, స్వతంత్ర అసోసియేషన్. 76 దేశాలు, భూభాగాల నుంచి 450 కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 36,000 మంది ప్రపంచ ప్రముఖ జీవిత బీమా మరియు ఫైనాన్షియల్ సర్వీసుల వృత్తి నిపుణులు దీంట్లో భాగం. ఎండిఆర్‌టి సభ్యులు నిపుణ వృత్తి జీవులుగా గుర్తించబడ్డారు, వీరు పరిశ్రమలో అత్యుత్తములుగా గుర్తించబడిన వీరు అద్భుతమైన క్లయింట్ సర్వీసును నిర్వహిస్తారు మరియు జీవిత బీమా, ఆర్థిక సేవల వాణిజ్యంలో అత్యున్నత సేల్స్ ఎక్స్‌లెన్స్ ప్రమాణాన్ని సాధించారు.